పబ్‌లోకి అనుమతించలేదని బౌన్సర్‌పై.. | youngmens was attack on pub bouncer | Sakshi
Sakshi News home page

పబ్‌లోకి అనుమతించలేదని బౌన్సర్‌పై..

Published Fri, Sep 30 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

youngmens was attack on pub bouncer

బంజారాహిల్స్‌: పీకలదాక మద్యం తాగి ఉన్న తొమ్మిది మంది యువకులు పబ్‌లోకి అనుమతించాలని గొడవ చేసి.. బౌన్సర్‌పై దాడి చేసి పరారయ్యారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 36లో ఉన్న కాక్‌టైల్‌ పబ్‌లో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం... మల్లేపల్లికి చెందిన వసీంఖాన్, చాంద్రాయణగుట్ట కేశవగిరికి చెందిన బీ.ఫార్మసీ విద్యార్థి ఎండీ అబ్దుల్లా మరో ఏడుగురితో కలిసి గురువారం అర్ధరాత్రి 12.30కి కాక్‌టైల్‌ పబ్‌కు వచ్చారు.

తమను లోనికి అనుమతిం చాలని కోరగా.. సమయం అయిపోయిందని, పబ్‌ను మూసివేస్తున్నారని బౌన్సర్‌ పురుషోత్తం తెలిపారు. దీంతో వీరంతా అతడితో వాగ్వాదానికి దిగి, లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. అడ్డుకు న్న బౌన్సర్‌పై దాడి చేసి గాయపర్చడంతో పాటు ఫర్నీచర్‌ను ధ్వం సం చేశారు. దీంతో పబ్‌లో మద్యం తాగుతున్న పలువురు యువతీయువకులు భయాందోళనతో అక్కడి నుంచి బయటకు పరుగుతీశారు.

మిగతా బౌన్సర్లు వచ్చి వారిని పట్టుకొనేందుకు యత్నించగా పరారయ్యారు. బాధితుడి  ఫిర్యాదు మేరకు పోలీసులు దాడికి పాల్పడ్డవారిపై ఐపీసీ సెక్షన్‌ 452, 307, 427, 506, 143ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement