సాక్షి, హైదరాబాద్: రాడిసన్ బ్లూప్లాజా హోటల్ ఆధీనంలోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితుడు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమీప బంధువైన అర్జున్ వీరమాచినేని తృటిలో పోలీసుల నుంచి తప్పించుకున్నట్టు తెలిసింది. గత ఆదివారం తెల్లవారుజామున పబ్‌పై పోలీసులు దాడిచేసి అందరినీ బంజారాహిల్స్ ఠాణాకు తరలించిన విషయం తెలిసిందే. ఆ రోజు ఉదయం అర్జున్ ఠాణా వద్దకు వచ్చాడు. తానెవరో చెప్పకుండా గమనించడం మొదలుపెట్టాడు. అప్పటికే పబ్ భాగస్వామి అభిషేక్, మేనేజర్ అనిల్‌కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వార్తలు వెలువడ్డాయి.
ఇది చూసిన అర్జున్ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఇంటికి కూడా వెళ్లకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ విషయాన్ని సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిర్ధారించుకున్నట్టు సమాచారం. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందాలు గురువారం అర్జున్, కిరణ్‌రాజ్‌ల ఇళ్లకు వెళ్లి ఆరా తీసినట్టు తెలిసింది. ఈ పబ్‌లో అభిషేక్‌తోపాటు అర్జున్, పెనుమత్స కిరణ్‌రాజు భాగస్వాములుకాగా.. అనిల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. పోలీసులు దాడి చేసినప్పుడు అనిల్, అభిషేక్ పబ్ వద్దే ఉండటంతో పట్టుబడ్డారు. రిమాండ్‌లో ఉన్న ఈ ఇద్దరిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌పై శుక్రవారం ఎంఎస్‌జే కోర్టులో వాదనలు జరగనున్నాయి.
(చదవండి: లగేజ్ బ్యాగేజ్‌లలో గంజాయి ప్యాకెట్లు..నలుగురు అరెస్టు)
Comments
Please login to add a commentAdd a comment