సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో డ్రగ్స్ కేసులు సంచలనంగా మారాయి. మొన్న డ్రగ్స్ తీసుకొని ఓ విద్యార్ధిని మృతి చెందగా.. ఆదివారం బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ వాడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖుల కొడుకులు, కూతుళ్ల పేర్లు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారికి నోటీసులు కూడా ఇచ్చారు.
తాజాగా ఈ కేసు విషయమై.. పబ్‌లో ఉన్నవారు అందరూ డ్రగ్స్ తీసుకుంటున్నారని ప్రచారం కావడంతో షార్ట్ ఫిలిం నటి కల్లపు కుషితా స్పందించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీకి వెళ్లాను. మరికాసేపట్లో పార్టీ ముగుస్తుంది.. ఇంటికి వెళ్దామనుకున్నాం. కానీ అంతలోనే పోలీసులు వచ్చారు. మేము వారికి సహకరించాం. అనవసరంగా మాపై తప్పడు ప్రచారం చేయకండి. మేం డ్రగ్స్ తీసుకోలేదు. మీడియా వాళ్లు కొంచం సమన్వయం పాటించాలన్నారు.
తమలాగే ఈ వివరాలపై దుష్ప్రచారం చేస్తున్న వారికి సైతం కుటుంబాలు ఉన్నాయని, గుర్తుంచుకోవాలని ఇది నిజమని కుటుంబసభ్యులు భావిస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. లేట్ నైట్ పబ్‌లో ఉండటం తమ తప్పు కాదన్నారు. అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న విషయం తమకు తెలియదన్నారు. తెలిస్తే మేము ఎందుకు వెళ్తామని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు ఆపాలని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment