పవన్‌ కల్యాణ్‌ బౌన్సర్లకు గాయాలు | Pawan Kalyan Bouncers Vehicle Accident In East Godavari | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 15 2018 9:59 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Pawan Kalyan Bouncers Vehicle Accident In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ బౌన్సర్లు ప్రయాణిస్తున్న వాహనం గురువారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. రంగంపేట వద్ద వీరి వాహనం ఓ లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. రాజానగరంలో ఏర్పాటు చేసిన పవన్‌ కల్యాణ్‌ బహిరంగ సభకు వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన 9 మందిని జీఎస్‌ఎల్‌ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఇదిలాఉండగా.. రాజానగరం సభ అనంతరం పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌ వెళ్లిపోయినట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement