70 ఏళ్ల వృద్ధుడిపై బౌన్సర్ల దాడి | Bouncers attacks 70 years old man | Sakshi
Sakshi News home page

70 ఏళ్ల వృద్ధుడిపై బౌన్సర్ల దాడి

Published Thu, Dec 17 2015 10:51 AM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM

Bouncers attacks 70 years old man

విజయవాడ : 'కాల్మనీ' కీలక సూత్రధారి శ్రీరామమూర్తి ముఠా సాగించిన దాష్టీకం గురువారం మరోకటి వెలుగులోకి వచ్చింది. నగదు అప్పు తీసుకున్న కృష్ణాజిల్లా  కాకులపాడుకు చెందిన ఎలమంచిలి వెంకటేశ్వరరావు కుటుంబాన్ని వేధింపులకు గురి చేశారు. ఆ వేధింపుల కారణంగా 16 నెలల క్రితమే వెంకటేశ్వరరావు భార్య, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు.

శ్రీరామమూర్తి ఆగడాలపై గతంలో జిల్లా ఎస్పీకి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. శ్రీరామమూర్తికి అధికార పార్టీ నేతల అండ ఉన్న కారణంగా సదరు ఫిర్యాదును పట్టించుకోలేదు. తాజాగా 70 ఏళ్ల వెంకటేశ్వరరావుపై బౌన్సర్లు దాడి చేశారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ను గురువారం బాధితుడు కలసి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement