సిడ్నీ : టీమిండియాతో జరగనున్న నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ఆసీస్ యువ ఆటగాడు విల్ పుకోవిస్కిపై జట్టు మేనేజ్‌మెంట్ మంచి అంచనాలు ఉండేవి. డేవిడ్ వార్నర్ గైర్హాజరీలో పుకోవిస్కి రాణిస్తాడని ఆశలు పెట్టుకుంది. కానీ అనూహ్యంగా టీమిండియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కార్తిక్ త్యాగి వేసిన బౌన్సర్ విల్ పుకోవిస్కి హెల్మెట్ భాగాన్ని బలంగా తాకింది. (చదవండి : 'ఐదు రోజులు ఒక్కపాటనే వినిపించారు')
దీంతో కొన్ని నిమిషాల పాటు మొకాళ్లపై నిల్చుండిపోయిన పుకోవిస్కి.. తర్వాత ఫిజిమో సూచన మేరకు 23 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. వెంటనే మెడికల్ టీమ్‌ను సంప్రదించగా.. గాయం తీవ్రత అంతగా లేదని తేల్చి చెప్పింది. మరోవైపు ఆసీస్ మేనేజ్‌మెంట్ డిసెంబర్ 17 నుంచి ఆరంభం కానున్న మొదటి టెస్టుకు అందుబాటులో ఉంటాడని స్పష్టం చేసింది. అయితే పుకోవిస్కి ఆడడంపై ఇంకా అనుమానాలు తొలిగిపోలేదు.
ఈ నేపథ్యంలో లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ పుకోవిస్కిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఇలాంటివి జరుగుతాయని నేను ముందే ఊహించా. సాధారణంగానే ఆసీస్ పిచ్‌లు పేసర్లకు స్వర్గధామంగా ఉంటాయి.ఒకవేళ బ్యాట్స్‌మన్ మైదానంలోకి దిగాడంటే.. దేశం, రాష్ట్రం, క్లబ్.. ఇలా దేనికి ప్రాతినిధ్యం వహించినా బౌన్సర్లు ఆడాల్సిందే. రానున్న టెస్టు సిరీస్‌లో పుకోవిస్కి ఆడితే ఇలాంటి బౌన్సర్లు మరిన్ని రానున్నాయి.. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. నాకు తెలిసి టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ బౌన్సర్లు వేయడంలో దిట్ట.. అతని నుంచి మంచి బౌన్సర్లను ఇదివరకే చూశా' అంటూ తెలిపాడు. కాగా అడిలైడ్ వేదికగా డిసెంబర్ 17 నుంచి ఆసీస్‌తో మొదటి డే నైట్ టెస్టు మ్యాచ జరగనుంది. (చదవండి : త్యాగి బౌన్సర్.. ఆసీస్‌కే ఎందుకిలా?)
Comments
Please login to add a commentAdd a comment