
ప్రతి మండలానికి గురుకుల పాఠశాల
- అక్టోబర్ నాటికి భక్త రామదాసు నీళ్లు
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
పోచారం (కూసుమంచి): విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని, ఇందులో భాగంగానే ప్రతి మండలంలో గురుకుల పాఠశాల నెలకొల్పాలని భావిస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పోచారం గ్రామ పంచాయతీలో ఐదుకోట్ల రూపాయల వ్యయంతో బీటీ రహదారుల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అక్కడ జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పాలేరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధే తన ధ్యేయమని అన్నారు. నియోజకవర్గంలోని 70వేల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో చేపట్టిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకం పూర్తికావచ్చిందన్నారు. అక్టోబర్ నాటికి నియోజకవర్గంలోని చెరువులను సాగర్ జలాలతో నింపుతామని హామీ ఇచ్చారు. పాలేరుకు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను తరలించే ప్రయత్నం జరుగుతోందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రహదారి, తాగునీరు, సాగునీరు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇవన్నీ ఉగాది నాటికి ప్రజల అందుబాటులోకి వస్తాయన్నారు. చింతలతండా–చేగొమ్మ రహదారి నిర్మాణానికి హామీ ఇచ్చారు. పాలే రు పాత కాలువ నీటి విడుదలపై ఎటువంటి అపోహలు వద్దని, కాలువ కింద పంటలను ఎట్టి పరిస్థితుల్లో ఎండిపోనివ్వమని హామీ ఇచ్చారు. పాలేరు పాత కాలువ ఆయకట్టుపై అపోహలను నమ్మవద్దని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మ¯ŒS మువ్వా విజయ్‌బాబు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వడ్తియ రాంచంద్రునాయక్, సర్పంచ్ పోలంపల్లి అప్పారావు, జడ్పీ సీఈఓ మారుపాక నాగేష్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బేగ్ తదితరులు పాల్గొన్నారు.