mandal
-
కరువు మండలాల్లో అదనపు ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: కరువు మండలాల్లో కూలీల కుటుంబాలకు అదనపు పనులు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో కుటుంబానికి అదనంగా 50 పనిదినాల పాటు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించనుంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 103 కరువు మండలాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో పూర్తిగా నగర ప్రాంతంలో ఉండే కర్నూలు మినహాయించి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మిగిలిన 102 మండలాల్లో అదనపు పనులు కల్పిస్తారు. ఈ మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు కావాలని కోరే ఒక్కో కుటుంబం ఏడాదికి గరిష్టంగా 150 పనిదినాల పాటు పనులు పొందే వీలుంటుంది. దీంతో 2.42 లక్షల కుటుంబాలకు మేలు చేకూరుతుంది. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.13,660 వరకు అదనపు లబ్ధి కలుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సోమవారం కేంద్రానికి లేఖ రాశారు. కరువు మండలాల్లో అదనపు పని దినాలు.. సాధారణంగా ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతంలో ఒక్కో కుటుంబానికి ఏడాదికి వంద పనిదినాల కల్పనకు అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో మాత్రం ఈ ఏడాది ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 150 పనిదినాల పాటు పనులు కల్పిస్తారు. 102 మండలాల పరిధిలో 5.68 లక్షల కుటుంబాలకు చెందిన దాదాపు 10 లక్షల మంది కూలీలు ఉన్నారు. వీరు ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకుంటుంటారు. 5.68 లక్షల కుటుంబాల్లో దాదాపు లక్ష కుటుంబాలు ఇప్పటికే వంద పనిదినాల గరిష్ట లక్ష్యాన్ని పూర్తి చేసుకుని ఉండడం లేదా గరిష్ట లక్ష్యానికి అతి దగ్గరగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ కుటుంబాలతోపాటు దాదాపు మరో లక్షన్నర కుటుంబాలు వచ్చే ఐదు నెలల్లో అదనపు పనులు కోరేందుకు అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 102 మండలాల పరిధిలో కనీసం 2,42,282 కూలీల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. -
మండల, జిల్లా పరిషత్‌లకు కేంద్ర నిధులు
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లుగా నిధుల లేమితో కొట్టుమిట్టాడిన జిల్లా, మండల పరిషత్‌లకు ఊరట దక్కనుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్ సంస్థలకు ఇచ్చే నిధులను గ్రామ పంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లకు సైతం కేటాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ సంస్థలకు 15 ఆర్థిక సంఘం నిధుల విడుదలకు సంబంధించిన విధివిధానాలు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేసింది. శుక్రవారం రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. మొండిచేయి చూపిన 14వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వం తనకు వచ్చే పన్ను వాటాలో కొంత మొత్తాన్ని ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రాలతో పాటు స్థానిక సంస్థలకు నేరుగా అందజేస్తుంది. 2015 ఏప్రిల్ నుంచి 2020 మార్చి మధ్య ఐదేళ్ల కాలానికి అమల్లో ఉన్న 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్రం విడుదల చేసే నిధుల్లో 100 శాతం నిధులను గ్రామ పంచాయతీలకే కేటాయిస్తూ అప్పట్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు 13వ ఆర్థిక సంఘం అమల్లో ఉన్నప్పుడు కేంద్రం ఇచ్చే నిధుల్లో 70 శాతం గ్రామ పంచాయతీలకు, 20 శాతం జిల్లా పరిషత్‌లకు, 10 శాతం మండల పరిషత్‌లకు కేటాయించేవారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా మండల, జిల్లా పరిషత్‌లు నిధులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా నిధులివ్వకపోవడంతో మండల, జిల్లా పరిషత్‌ల్లో అభివృద్ధి నిలిచిపోయింది. రాష్ట్రాలకు కొంత స్వేచ్ఛ కేంద్రం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 70–85 శాతం నిధులను గ్రామ పంచాయతీలకు.. 10–25 శాతం నిధులను మండల పరిషత్‌లకు.. 5–15 శాతం నిధులను జిల్లా పరిషత్‌లకు కేటాయించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది. నిర్ణీత పరిమితికి లోబడి ఎంతెంత కేటాయింపులు చేయాలన్న దానిపై రాష్ట్రాలకు కొంత స్వేచ్ఛ ఇస్తున్నట్టు పేర్కొంది. రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్నచోట(ఆంధ్రప్రదేశ్ కాదు) గ్రామ పంచాయతీలకు 70–85 శాతం.. జిల్లా పరిషత్‌లకు 15–30 శాతం నిధులు కేటాయించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,625 కోట్లు 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీలోని గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లకు కలిపి రూ.2,625 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రానికి రూ.1,847 కోట్లు కేటాయించింది. పరిమితికి లోబడి ఏ పంచాయతీరాజ్ సంస్థకు ఎన్ని నిధులను కేటాయిస్తారన్న వివరాలను ఏప్రిల్‌లోగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖకు తెలియజేస్తే జూన్‌లో మొదటి విడత నిధులు విడుదల చేస్తామని కేంద్రం వెల్లడించింది. -
రెవెన్యూ ఉక్కిరిబిక్కిరి
కర్నూలు(అగ్రికల్చర్) : 1985లో మండల వ్యవస్థ ఏర్పాటైంది. అప్పట్లో జిల్లా జనాభా 22 లక్షలు. అందుకు అనుగుణంగా రెవెన్యూ శాఖకు సంబంధించి మండల రెవెన్యూ అధికారి కార్యాలయాలకు పోస్టులు మంజూరు చేశారు. ప్రస్తుత జనాభా దాదాపు 45 లక్షలు. పదేళ్లకోసారి రెవెన్యూ శాఖను పునర్ వ్యవస్థీకరించాల్సి ఉంది. కానీ ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో 33ఏళ్ల క్రితం ఉన్న పోస్టులతోనే పని కానిచ్చేస్తున్నారు. ఫలితంగా సిబ్బంది పై పనిభారం అధికమవుతోంది. ఒక్కోసారి రాత్రి పొద్దుపోయే వరకు పనిచేయడంతో పాటు సెలవు రోజుల్లోనూ పనిచేయాల్సి వస్తోంది. లేకపోతే మెమోలు అందుకోవాల్సి వస్తోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి జనాభా ప్రకారం.. మండలాలకు 1985లో జనాభా ప్రాతిపదికన ఎమ్మార్వో, సూపరింటెండెంట్, ఒక సీనియర్ అసిస్టెంటు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోస్టులు మంజూరు చేశారు. నియోజకవర్గ కేంద్రాల మండలాలకు ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోస్టు, ఒక ఎన్నికల డీటీ పోస్టును అదనంగా కేటాయించారు. చుక్కల భూముల క్రమబద్ధీకరణకు సిబ్బంది కొరత.. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లాకు మూడు తహసీల్దారు, మూడు డీటీ పోస్టులు, ఒక డిప్యూటీ కలెక్టర్ పోస్టు మంజూరు చేసింది. 2017లో చుక్కల భూముల క్రమబద్ధీ్దకరణకు ప్రత్యేక చట్టాన్ని తెచ్చిన ప్రభుత్వం పోస్టులను మాత్రం కేటాయించలేదు. డిప్యుటేషన్‌పై సిబ్బందిని నియమించుకోవాలని మాత్రమే సూచించింది. ఇప్పటికే పని ఒత్తిడి, సిబ్బంది కొరతతో సతమతమవుతున్న రెవెన్యూ యంత్రాంగం చుక్కల భూముల క్రమబద్దీకరణ చట్టంతో ఊపిరితిప్పుకోలేకపోతున్నారు. మండలస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు సిబ్బంది కరువయ్యారు. వీటికి సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించుకొని దరఖాస్తుల పరిశీలనకు చర్యలు తీసుకున్నారు. ఉన్న పోస్టుల్లోనూ ఖాళీలు.. 1985లో మంజూరు చేసిన పోస్టులయిన భర్తీగా ఉన్నాయా అంటే అదీ లేదు. గ్రామ రెవెన్యూ అధికారి, జూనియర్ అసిస్టెంట్ మొదలుకొని సీనియర్ అసిస్టెంట్లు, డీటీలు, తహసీల్దారు కేడర్ వరకు అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీఆర్వో పోస్టులు 792 ఉండగా 150 వరకు ఖాళీగా ఉన్నాయి. జూనియర్ అసిస్టెంటు పోస్టులు 216 ఉండగా 35 పోస్టులు, సీనియర్ అసిస్టెంటు పోస్టులు 198 ఉండగా 25 పోస్టులు, తహసీల్దారు పోస్టులు 72 ఉండగా 6 పోస్టులు, డీటీ పోస్టులు 123 ఉండగా 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతంత మాత్రం ఉన్న సిబ్బందిని కూడా వివిధ అవసరాలకు డిప్యుటేషన్‌పై బదిలీ చేస్తుండటం వల్ల ఉన్న సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. రెవెన్యూ సిబ్బందిపై పని ఒత్తిడి.. 1985లో మండలాల్లో సగటున వందల్లోనే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేవారు. ప్రస్తుతం వేలాది మంది విద్యార్థులకు ఇవ్వాల్సి వస్తోంది. ఎన్నికల విధులు, భూముల వ్యవహారాలు, విద్యార్థులు, రైతులు, ఇతర వర్గాలకు అవసరమైన ధ్రువపత్రాల జారీ, ప్రొటోకాల్ విధులు, ప్రజా పంపిణీ, లాం అండ్ ఆర్డర్, విపత్తుల నిర్వహణ, పంటల నమోదు, భూముల సర్వే, మైనింగ్ వ్యవహారాలు, ఇతర శాఖల వ్యవహారాలు తదితర విధులు, బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా చుక్కల భూముల క్రమబద్ధీక రణ విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బందిని పెంచాలి జనాభా ప్రాతిపదికన తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాలకు పోస్టులను పెంచాలి. ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఉన్న వారిని ఇతర అవసరాలకు డిప్యుటేషన్‌పై బదిలీ చేస్తున్నారు. దీంతో సిబ్బందిపై పని భారం అధికమవుతోంది. అన్ని కేటగిరి పోస్టులను పెంచడంతో పాటు, చుక్కల భూముల క్రమబద్దీకరణ చట్టం అమలుకు ప్రత్యేక పోస్టులు మంజూరు చేయాలని మా అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తాం. – రాజశేఖర్‌బాబు, జిల్లా అధ్యక్షుడు, జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ -
పది మండలాల్లోనే రీ అస్సైన్డ్..!
చేతులు మారిన అసైన్డ్ భూములను కబ్జాలో ఉన్నవారికే రీఅసైన్డ్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం జిల్లాలో కేవలం పది మండలాలకు మాత్రమే వర్తించనుంది. రీ అసైన్డ్‌కు సంబంధించి ప్రభుత్వం తాజాగా రూపొందించిన నిబంధనల్లో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)ను చేర్చకపోవడంతో ఆ పరిధిలోకి వచ్చే 17 మండలాలకు ఈ అవకాశం చేజారనుంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 5180 ఎకరాల మేర అసైన్డ్ భూములు చేతులు మారగా.. అందులో రెండు వేలకు పైగా ఎకరాల్లో మాత్రమే రీ అసైన్డ్ చేసే అవకాశం ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎటువంటి జీవనాధారమూ లేని పేదలకు ప్రభుత్వం గతంలో భూములను పంపిణీ చేసింది. భూమిలేని నిరుపేదలకు మాత్రమే వీటిని అసైన్డ్ చేసింది. అయితే, కాలగమనంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో కొందరు.. కుటుంబ అవసరాలరీత్యా మరికొంత మంది ఈ భూములను అమ్ముకున్నారు. ఇలా చేతులు మారిన భూముల్లో కొన్నిచోట్ల బడాబాబులు పాగా వేశారు. కొన్ని భూములు మాత్రం మరికొందరు పేదల చేతుల్లోకి వెళ్లాయి. పీఓటీ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్) చట్టం ప్రకారం అసైన్డ్ భూములు పరాధీనమైతే స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ క్రమంలో చట్టాన్ని ఉల్లంఘించినట్లు గుర్తించిన భూములను వెనక్కి తీసుకుంది. 3705.02 ఎకరాలు స్వాధీనం జిల్లావ్యాప్తంగా 87,064.35 ఎకరాలను పేదలను పంపిణీ చేశారు. ఇందులో సుమారు 3705.02 ఎకరాల మేర సంపన్నవర్గాలు, బహుళజాతి సంస్థల చేతుల్లోకి వెళ్లినట్లు జిల్లా యంత్రాంగం తేల్చింది. ముఖ్యంగా నగర శివార్లలో విలువైన ఈ భూములపై కన్నేసిన పెద్దలు తమ విలాసాలకు కేంద్రాలుగా మలుచుకున్నారు. ఫామ్‌హౌస్, రిసార్టులు నిర్మించడమేగాకుండా ఇంజనీరింగ్ కాలేజీలు, వైద్య కళాశాలలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో కొన్ని చోట్ల ఈ భూములను రెవెన్యూ యంత్రాంగం వెనక్కి తీసుకుంది. పది మండలాలకే పరిమితం! భూ రికార్డుల ప్రక్షాళనతో పరాధీనమైన అసైన్డ్ భూముల చిట్టా వెలుగులోకి వచ్చింది. ఏయే భూములు ఎవరి ఆక్రమణల్లో ఉన్నాయనేది తేలింది. ఈ క్రమంలో పీఓటీ చట్టానికి విరుద్ధంగా పాగా వేసిన వారి భూముల వివరాలను సేకరించింది. దీంతో జిల్లావ్యాప్తంగా 5180 ఎకరాల మేర భూములు చేతులు మారినట్లు గుర్తించింది. అయితే, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ భూములను కొనుగోలు చేసిన భూముల్లేని పేదల పేరిట రీఅసైన్డ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. గతేడాది 31వ తేదీ నాటికి ఆయా భూముల్లో కబ్జా ఉన్నవారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, రీఅసైన్డ్ చేసే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టింది. కాగా, ప్రభుత్వ తాజా నిర్ణయం మన జిల్లాలో సంపూర్ణంగా అమలు కావడం లేదు. గతంలో హెచ్ఎండీఏ పరిధిలో అసైన్డ్ భూముల క్రయ విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం.. భూముల పంపిణీ వ్యవహారంపై న్యాయస్థానాల్లో పలు కేసులు నడుస్తుండడంతో శివారు మండలాలకు రీ అసైన్డ్ వర్తించదని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో హెచ్ఎండీఏ పరిధిలోకి రాని పది మండలాలు కొందుర్గు, చౌదరిగూడ, కేశంపేట, ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, మంచాల, యాచారం(పార్ట్), ఫరూఖ్‌నగర్(పార్ట్), కడ్తాల్‌లో మాత్రమే భూముల రీఅసైన్డ్‌కు వీలు కలుగనుంది. -
కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆ గ్రామ ప్రజలకు కొత్త కష్టం
-
అగ్గి రగిలింది
► జ్యోతుల వర్గంపై జగ్గంపేట నియోజకవర్గంలో తిరుగుబాటు ►టీడీపీ పదవులకు గండేపల్లి మండలాధ్యక్షుడి రాజీనామా ► ఫలించని నెహ్రూ వర్గీయుల దౌత్యం ► ఇప్పటికే దూరమైన పలువురు నేతలు ►రాజీనామాల పరంపరతో ‘దేశం’లో అలజడి రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఓడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయి. ఈ సామెత మెట్ట ప్రాంతంలో సీనియర్ నాయకుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విషయంలో ఇప్పుడు నిజమవుతోంది. మొదట్లో టీడీపీలో ఉన్న ఆయన.. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఆ పార్టీని వంచించి.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏ పార్టీలో ఉన్నా జిల్లా రాజకీయాలను శాసించేవారు. అటువంటి నాయకుడికి వ్యతిరేకంగా ఇప్పుడు సొంత పార్టీలో.. సొంత నియోజకవర్గంలోనే అసమ్మతి అగ్గి రగిలింది. ఈ పరిణామాలు ఆయన వర్గాన్ని చివరకు ఏ తీరానికి చేరుస్తుందా అనే చర్చ మెట్ట రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఆదినుంచీ తెలుగుదేశం పార్టీ విధేయుడిగా ఉన్న గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు పోతుల మోహనరావు పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. ఆవిర్భావం నుంచీ ఆయన పార్టీలో క్రియాశీలక నేతగా ఉన్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన జ్యోతుల నెహ్రూ వర్గం.. తమకు కనీస మర్యాద, ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్వగ్రామం సింగరంపాలెంలో రాజీనామా విషయాన్ని మోహనరావు ప్రకటించారు. పార్టీ మండల అధ్యక్ష పదవితోపాటు, వైఎస్ ఎంపీపీ, మండల స్థాయి జన్మభూమి కమిటీ పదవులకు ఆయన రాజీనామా చేశారు. తద్వారా పార్టీ అధిష్టానానికి తన అసంతృప్తిని తెలియజేశారు. ఆయనకు సంఘీభావంగా సూరంపాలెం గ్రామానికి చెందిన కుంచే వెంకటస్వామి, ఎన్టీ రాజాపురానికి చెందిన వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కంటిపూడి సత్యనారాయణ కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వీరిద్దరూ కూడా నెహ్రూతో రాజకీయంగా పొసగని ఒకప్పటి జగ్గంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జ్యోతుల చంటిబాబు వర్గీయులే కావడం గమనార్హం. దీనినిబట్టి నెహ్రూ ‘సైకిల్’ ఎక్కాక.. చంటిబాబు వర్గంగా ముద్రపడ్డ నేతలను ఒక పథకం ప్రకారమే పార్టీకి దూరం చేస్తున్నట్టు కనిపిస్తోందని టీడీపీ సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. ఒక్కపనీ చేయించుకోలేకపోతే ఇంకెందుకు? కార్యకర్తగా ఉన్నప్పుడే తన గ్రామానికి రెండు మూడు రోడ్లు వేయించుకున్న తాను మండల స్థాయిలో క్రియాశీలక పదవిలో ఉన్నా ఒక్క పని కూడా చేయించుకోలేకపోతున్నానని మోహనరావు ఆవేదన చెందుతున్నారు. కనీసం ఒకరిద్దరికి కూడా గృహ నిర్మాణ రుణాలు, పింఛన్లు మంజూరు కాకుండా ప్రత్యర్థులు మోకాలడ్డుతున్నారని ఆయన వర్గీయులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇది పొమ్మనకుండానే పొగబెట్టడం కాక మరేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తమను కేవలం కూరలో కరివేపాకులుగా వినియోగించుకుని విసిరికొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గండేపల్లి మండలంలో కోర్పు లచ్చయ్యదొర ఏం చెబితే అది చేసుకుంటూపోతే ఇక పార్టీ మండల అధ్యక్ష పదవిలో ఉండి ఉపయోగమేమిటని పోతుల వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఉత్సవ విగ్రహంలా ఉండేæ ఈ పదవులు ఎందుకనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చామని చెబుతున్నారు. ఫలించని నెహ్రూ యత్నాలు మోహనరావు సహా ఇతర నేతలు రాజీనామాకు సిద్ధపడుతున్నారనే విషయం తెలియడంతో వారిని బుజ్జగించేందుకు రెండు రోజులుగా నెహ్రూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నెహ్రూ ముఖ్య అనుచరులు అత్తులూరి సాయిబాబా, మంతెన నీలాద్రిరాజులు జరిపిన దౌత్యం కూడా బెడిసికొట్టిందనే చెబుతున్నారు. 48 గంటల్లో సర్దుబాటు చేస్తామని పలువురు నేతలు రాజీ‘డ్రామా’ నిర్వహించినా వెనక్కు తగ్గేది లేదని మోహనరావు తదితరులు తెగేసి చెప్పారు. ఒకవేళ రాజీనామాలపైæ ఇప్పుడు వెనక్కు తగ్గినా.. ఎనిమిది నెలలుగా ఎదురవుతున్న అవమానాలు భవిష్యత్తులో రెట్టింపు అవుతాయని ఆ వర్గం ఆందోళన చెందుతోంది. మంగళ, బుధవారాల్లో వైస్ ఎంపీపీ పదవికి రాజీనామా లేఖను జిల్లా పరిషత్ సీఈవోకు అందజేసేందుకు మోహనరావు సిద్ధపడుతున్నారు. ఒకప్పుడు ఏ పార్టీలో ఉన్నా కంటిసైగతో రాజకీయాన్ని నడిపించిన నెహ్రూ.. సొంత నియోజకవర్గంలో రాజుకున్న అసంతృప్తి కుంపటిని ఆర్పలేకపోవడం చూస్తే.. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. దూరదూరంగా చంటిబాబు మరోపక్క నెహ్రూ వర్గీయుల ఆధిపత్య రాజకీయాలతో ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్, నియోజకవర్గ ఇన్చార్జి జ్యోతుల చంటిబాబు టీడీపీ కార్యకలాపాలకు దాదాపు దూరమయ్యారు. జగ్గంపేటలో సీనియర్ నాయకుడు కర్రి శ్రీను అసంతృప్తితో ఆదివారమే రాజీనామా చేశారు. గోకవరం మండలం తంటికొండ ఎంపీటీసీ సభ్యురాలు ముర్ల నాగలక్ష్మి.. పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని పేర్కొంటూ ఇటీవల రాజీనామాకు సిద్ధపడగా.. ఆమెను మాత్రం ఎలాగోలా బుజ్జగించి ఆపగలిగారు. నెహ్రూ చేరికతో రాజుకున్న మూడో కుంపటి నెహ్రూ టీడీపీలోకి రాక పూర్వం జగ్గంపేట నియోజకవర్గంలోని ఆ పార్టీలో కాకినాడ ఎంపీ తోట నరసింహం, జ్యోతుల చంటిబాబు వర్గాలుండేవి. నెహ్రూ టీడీపీలోకి వచ్చాక మూడో కుంపటి రాజుకుంది. ఈ మూడు కుంపట్ల మ«ధ్య మండలస్థాయి, ద్వితీయ శ్రేణి నాయకులు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగలించుకుంటున్నారు. ప్రత్యర్థి వర్గాన్ని ఎలాగోలా సాగనంపేందుకు పొమ్మనకుండానే పొగ పెడుతున్నారు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో వేచి చూడాల్సిందే. నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నా.. గండేపల్లి : ‘‘టీడీపీ ఆవిర్భావం నుంచీ కార్యకర్తగా ఎన్నో పనులు చేయించుకోగలిగాను. నా గ్రామంలో ఎన్నో పనులు చేయించాను. అధికార పార్టీకి మండల అధ్యక్షుడిని. మండల పరిషత్ ఉపాధ్యక్షుడిని. ఇలా రెండు కీలకమైన పదవులున్నా.. సొంత ఊళ్లో పనులు చేసుకోలేని దుస్థితిలో ఉన్నాను. నా వీధిలో కూడా వేరేవారు పనులు చేపడుతున్నారు. దీనిపై పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లాను. అయినా ప్రయోజనం లేదు. కొద్ది నెలలుగా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. గతంలో టీడీపీ మండల అధ్యక్షుడు వేరే పార్టీకి పోవడంతో అప్పటినుంచీ ఆ బాధ్యతలను పూర్తిస్థాయిలో నెరవేర్చాను. అప్పగించిన బాధ్యతలను భుజాలపై వేసుకుని నమ్మకంగా పని చేశాను. ఇప్పుడు నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నాను. అధికారులు, నాయకులూ నా మాట పట్టించుకోవడం లేదు. అందుకే వైస్ ఎంపీపీ, పార్టీ మండల అధ్యక్ష పదవి, జన్మభూమి కమిటీ సభ్యుడి పదవి, ఎంపీటీసీ పదవులకు రాజీనామా చేస్తున్నాను’’ అని మండలంలోని టీడీపీ సీనియర్ నాయకుడు పోతుల మోహనరావు ఆవేదనతో చెప్పారు. స్వగ్రామం సింగరంపాలెంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ పదవుల రాజీనామా విషయాన్ని జెడ్పీ సీఈఓకు తెలియజేస్తానని చెప్పారు. పార్టీలోనే కొనసాగుతానని, పదవులకు మాత్రమే రాజీనామా చేశానని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన కొందరు నాయకులు మాట్లాడుతూ, రాజీనామా విషయంపై పునరాలోచన చేయాలని, కొద్ది సమయం ఇవ్వాలని కోరారు. ఈలోగా నాయకుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు ఎర్రంశెట్టి వెంకటలక్ష్మి భర్త బాబ్జీ, సొసైటీ అధ్యక్షులు పాలకుర్తి ఆదినారాయణ, బొడ్డు సత్తిరాజు, సర్పంచ్‌లు బొండా శ్రీనుబాబు, పైణ్ని వెంకటేశ్వరరావు, మూలయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
నూతనంగా కర్నూలు అర్బన్ మండలం
కర్నూలు(అగ్రికల్చర్): కొన్నేళ్లుగా ఊరిస్తున్న కర్నూలు అర్బన్ మండలం కల సాకారం అయింది. జిల్లాలో కర్నూలు, కల్లూరు, నంద్యాల, ఆదోని అర్బన్ మండలాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం కర్నూలు అర్బన్ మండలం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి మెమో కూడా జారీ చేసింది. గతంలోనే సీసీఎల్ఏ అనిల్‌చంద్ర పునీట కర్నూలు అర్బన్ మండలం ఏర్పటు చేస్తున్నట్లుగా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రకటించారు. తాజాగా ప్రభుత్వం కర్నూలు అర్బన్ మండలం ఏర్పాటుకు మెమో ఇచ్చింది. తర్వాత జీవో విడుదల చేయాల్సి ఉంది. -
56 మండలాల్లో వర్షం
నల్లగొండ అగ్రికల్చర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా జిల్లాలోని 56 మండలాలలో వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా నేరేడుచర్ల మండలంలో 69.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అదే విధంగా మఠంపల్లి మండలంలో 40.2, వేములపల్లిలో 39.4, అనుములలలో 32.6, గరిడేపల్లిలో 31.6, మేళ్లచెరువులో 30.8, మిర్యాలగూడలో 30.4, త్రిపురారంలో 29.4, నిడమనూరులో 29.2, గుర్రంపోడులో 27.2, రాజాపేటలో 15.6, పీఏపల్లిలో 13.2, కట్టంగూరులో 11.4, భువనగిరిలో 11.2, తుర్కపల్లిలో 10.4, పెద్దవూరలో 10.4, వలిగొండలో 10.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అదే విధంగా నారాయణపురంలో 9.8, మోత్కురులో 9.0, తిప్పర్తిలో 9.0, దేవరకొండలో 9.0, యాదగిరిగుట్టలో 8.6, మునుగోడులో 8.4, గుండాలలో 7.6, కనగల్‌లో 7.4, హుజూర్‌నగర్‌లో 7.2, జాజిరెడ్డిగూడెంలో 7.2, తిరుమలగిరిలో 6.8, చండూరులో 6.6, ఆలేరులో 6.4, నూతన్‌కల్‌లో 6.4, కోదాడలో 6.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే బొమ్మలరామారంలో 6.0, బీబీనగర్‌లో 4.6, నార్కట్‌పల్లిలో 4.4, ఆత్మకూరు(ఎస్)లో 4.2, శాలిగౌరారంలో 4.0, నల్లగొండలో 3.6, ఆత్మకూరులో 3.4, మర్రిగూడలో 3.2, తుంగతుర్తిలో 3.2, చిట్యాలలో 3.0, నాంపల్లిలో 2.4, దామరచర్లలో 2.4, పోచంపల్లిలో 2.2, మునగాలలో 2.2, నడిగూడెంలో 2.0, నకిరేకల్‌లో 1.6 చింతపల్లిలో 1.4, సూర్యాపేటలో 1.4, చందంపేటలో 1.2, చివ్వెంలలో 1.2, పెన్‌పహడ్‌లో 1.2, చిలుకూరులో 1.0, కేతెపల్లిలో 0.2, మోతేలో 0.2, మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 10.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. -
ఏటీఎం కార్డుతో డబ్బుల అపహరణ
నవీపేట : మండలంలోని ఎల్కే ఫారం గ్రామానికి చెందిన పైస లింగంకు చెందిన ఏటీఎం కార్డును గుర్తు తెలియని దుండగులు అపహరించి రూ. 10 వేలు డ్రా చేసుకున్నారని ఎస్సై రవీందర్‌నాయక్ గురువారం తెలిపారు. కొద్ది రోజుల కిందట పైస లింగం తన ఖాతాలోని డబ్బులు డ్రా చేసి ఇవ్వాలని గుర్తు తెలియని యువకుడికి తన ఏటీఎం కార్డును ఇచ్చాడని పేర్కొన్నారు. సదరు వ్యక్తి కార్డు పని చేయడం లేదని ఇంకో కార్డును మార్చి ఇచ్చాడని పేర్కొన్నారు. డబ్బులను డ్రా చేసుకునేందుకు మండల కేంద్రంలోని ఎస్బీహెచ్ బ్యాంక్‌కు వెళ్లగా ఖాతాలోని రూ. 10వేలు డ్రా చేసినట్లు బ్యాంక్ అధికారులు చెప్పారని పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
ఏటీఎం కార్డుతో డబ్బుల అపహరణ
నవీపేట : మండలంలోని ఎల్కే ఫారం గ్రామానికి చెందిన పైస లింగంకు చెందిన ఏటీఎం కార్డును గుర్తు తెలియని దుండగులు అపహరించి రూ. 10 వేలు డ్రా చేసుకున్నారని ఎస్సై రవీందర్‌నాయక్ గురువారం తెలిపారు. కొద్ది రోజుల కిందట పైస లింగం తన ఖాతాలోని డబ్బులు డ్రా చేసి ఇవ్వాలని గుర్తు తెలియని యువకుడికి తన ఏటీఎం కార్డును ఇచ్చాడని పేర్కొన్నారు. వ్యక్తి కార్డు పని చేయడం లేదని ఇంకో కార్డును మార్చి ఇచ్చాడని పేర్కొన్నారు. డబ్బులను డ్రా చేసుకునేందుకు మండల కేంద్రంలోని ఎస్బీహెచ్ బ్యాంక్‌కు వెళ్లగా ఖాతాలోని రూ. 10వేలు డ్రా చేసినట్లు బ్యాంక్ అధికారులు చెప్పారని పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
అడవిదేవులపల్లి మండలం కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం
అడవిదేవులపల్లి (దామరచర్ల) : మండలంలోని అడవిదేవులపల్లిని మండల కేంద్రం చేయకపోవడాన్ని నిరసిస్తూ గ్రామానికి చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురువారం గ్రామంలో అఖిలపక్షాలు చేపట్టిన దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం మండల కేంద్రం చేయక పోవడంతో మనస్తాపానికి గురైన దేవతల సైదయ్య(25) అనే యువకుడు దీక్షవద్ద పురుగుల మందు తాగాడు. దీనిని గమనించిన గ్రామస్తులు వెంటనే చికిత్స కోసం గ్రామంలో ఉన్న ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడిని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పరామర్శించారు. అనంతరం దీక్ష సభా స్థలం వద్ద జూలకంటి మాట్లాడారు. అన్ని అర్హతలున్న అడవిదేవులపల్లిని మండల కేంద్రం చేయక పోవడం అన్యాయమన్నారు. మండల కేంద్రం కోసం చేస్తున్న ఉద్యమాలకు తమ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాటాల ద్వారానే మండల కేంద్రం సాధించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు మల్లేశ్, జగదీశ్వర్‌రెడ్డి,చంద్రశేఖర్‌యాదవ్,పాపానాయక్,వినోద్,సైదులు, మద్దెలశ్రవన్,బండి నాగేశ్వరావు,మున్నా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
అడవిదేవులపల్లి మండలం కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం
అడవిదేవులపల్లి (దామరచర్ల) : మండలంలోని అడవిదేవులపల్లిని మండల కేంద్రం చేయకపోవడాన్ని నిరసిస్తూ గ్రామానికి చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురువారం గ్రామంలో అఖిలపక్షాలు చేపట్టిన దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం మండల కేంద్రం చేయక పోవడంతో మనస్తాపానికి గురైన దేవతల సైదయ్య(25) అనే యువకుడు దీక్షవద్ద పురుగుల మందు తాగాడు. దీనిని గమనించిన గ్రామస్తులు వెంటనే చికిత్స కోసం గ్రామంలో ఉన్న ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడిని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పరామర్శించారు. అనంతరం దీక్ష సభా స్థలం వద్ద జూలకంటి మాట్లాడారు. అన్ని అర్హతలున్న అడవిదేవులపల్లిని మండల కేంద్రం చేయక పోవడం అన్యాయమన్నారు. మండల కేంద్రం కోసం చేస్తున్న ఉద్యమాలకు తమ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాటాల ద్వారానే మండల కేంద్రం సాధించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు మల్లేశ్, జగదీశ్వర్‌రెడ్డి,చంద్రశేఖర్‌యాదవ్,పాపానాయక్,వినోద్,సైదులు, మద్దెలశ్రవన్,బండి నాగేశ్వరావు,మున్నా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
46 మండలాల్లో మినీ రైతు బజార్లు
బుట్టాయగూడెం: జిల్లాలోని చిన్న సన్నకారు రైతుల సౌకర్యార్థం అన్ని మండలాల్లో మినీ రైతు బజార్లను ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. బుధవారం మండలంలో మినీ రైతు బజార్ ఏర్పాటుకు స్థల సేకరణ కోసం బుట్టాయగూడెంలో ఆయన పర్యటించారు. స్థానిక ఎంఆర్వో సంత మార్కెట్ వద్ద ఉన్న స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని 46 మండలాల్లో మినీ రైతు బజార్లను ఏర్పాటు చేసేందుకు స్థలాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 20 మండలాల్లో స్థల పరిశీలన పూర్తికాగా 19 రైతు బజార్ల ఏర్పాటుకు అనువైనదిగా గుర్తించామన్నారు. జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో స్థలాల్లో పరిశీలించామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి మొదటి దశలో ఇళ్ల నిర్మాణాలు, ఇతర సౌకర్యాల పనులు పూర్తి చేశామని తెలిపారు. రెండో దశ పనులను అక్టోబర్ నెలలో చేపట్టనున్నట్టు చెప్పారు. ఇళ్ల స్థలాలు, భూమికి భూమి సంబంధించి అధికారులు పనులలో నిమగ్నమయ్యారన్నారు. రెండో దశలో 2,200 ఇళ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. జిల్లాలో ప్రజాసాధికారిక సర్వే 96 శాతం పూర్తయ్యిందని చెప్పారు. మిగిలిన 4 శాతం సరైన సిగ్నల్ సౌకర్యం లేకపోవడం వల్ల ఆలస్యమవుతుందన్నారు. జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎస్.లవన్న, తహసీల్దార్ ఏజీ చిన్నికష్ణ, ఏవో బి.సుమలత పాల్గొన్నారు. -
ఏ కన్నతల్లి బిడ్డడో!
మక్తల్ : ఎక్కడి నుంచి దారితప్పి వచ్చిన పన్నెండేళ్ల ఈ బాలుడిది ఏ ఊరో తెలియడంలేదు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఉదయం మండలంఓని చిన్నగోప్లాపూర్కు చెం దిన కుమ్మరి ఆంజనేయులు సొంత పనిమీద బైక్‌పై మక్తల్ పట్టణానికి వచ్చాడు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలోని కర్ని–పంచలింగాల రోడ్డు వెంట ఓ బాలుడు నడుచుకుంటూ వస్తుండగా గమనించి ఆపి చేరదీశాడు. పేరు అడిగితే వెంకటేష్ అని, తల్లిదండ్రులు జయమ్మ, రాములు అన్నాడు. ఊరు పేరు చిన్నగోప్లాపూర్ అని చెప్పగా గ్రామస్తులతో ఆరా తీస్తే కాదన్నారు. ఈ విషయమై సోమవారం పోలీసులకు సమాచారం అందిస్తామన్నారు. -
ప్రతి మండలానికి గురుకుల పాఠశాల
అక్టోబర్ నాటికి భక్త రామదాసు నీళ్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోచారం (కూసుమంచి): విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని, ఇందులో భాగంగానే ప్రతి మండలంలో గురుకుల పాఠశాల నెలకొల్పాలని భావిస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పోచారం గ్రామ పంచాయతీలో ఐదుకోట్ల రూపాయల వ్యయంతో బీటీ రహదారుల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అక్కడ జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పాలేరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధే తన ధ్యేయమని అన్నారు. నియోజకవర్గంలోని 70వేల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో చేపట్టిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకం పూర్తికావచ్చిందన్నారు. అక్టోబర్ నాటికి నియోజకవర్గంలోని చెరువులను సాగర్ జలాలతో నింపుతామని హామీ ఇచ్చారు. పాలేరుకు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను తరలించే ప్రయత్నం జరుగుతోందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రహదారి, తాగునీరు, సాగునీరు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇవన్నీ ఉగాది నాటికి ప్రజల అందుబాటులోకి వస్తాయన్నారు. చింతలతండా–చేగొమ్మ రహదారి నిర్మాణానికి హామీ ఇచ్చారు. పాలే రు పాత కాలువ నీటి విడుదలపై ఎటువంటి అపోహలు వద్దని, కాలువ కింద పంటలను ఎట్టి పరిస్థితుల్లో ఎండిపోనివ్వమని హామీ ఇచ్చారు. పాలేరు పాత కాలువ ఆయకట్టుపై అపోహలను నమ్మవద్దని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మ¯ŒS మువ్వా విజయ్‌బాబు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వడ్తియ రాంచంద్రునాయక్, సర్పంచ్ పోలంపల్లి అప్పారావు, జడ్పీ సీఈఓ మారుపాక నాగేష్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బేగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇనుగుర్తిలో దీక్షలకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే సంఘీభావం
కేసముద్రం : చారిత్రక ఇనుగుర్తి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు మంగళవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రతోపాటు, భౌగోళికంగా అన్ని వనరులున్న ఇనుగుర్తిని మండలంగా ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యేకు సాధన సమితిసభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. దీక్షలో కూర్చున్న సిరంశెట్టి నవీన్ కుమార్, కూటికంటి ప్రణయ్, గణేష్, మధు, కిరణ్‌కుమార్, సాయికుమార్, దయాకర్, ప్రశాంత్‌కు పూలమాలలు వేశారు. రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు ఒద్దిరాజు రాంచందర్‌రావు, సాధనసమితి కన్వీనర్ చిన్నాల కట్టయ్య, కోకన్వీనర్ దార్ల భాస్కర్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ ర్యాలీ
దోమకొండ: మండలంలోని బీబీపేటను మండలంగా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని కోరుతూ శనివారం ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమానులు గ్రామంలోని ప్రధాన రోడ్లపై ట్రాక్టర్లను తిప్పి బీబీపేటను మండలంగా చేయాలంటూ నినాదాలు చేశారు. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. -
దసరా నుంచే నూతన మండలాల పరిపాలన
హాలియా : వచ్చే దసరా నుంచే నూతన మండలాల పరిపాలనా కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్రావ్ అన్నారు. శుక్రవారం తిర్మలగిరిలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల విభజనలో భాగంగా తిర్మలగిరి గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలనా సౌలభ్యం కలుగుతుందని ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. కొత్త మండలంలో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన వెంట తహసీల్దార్ వేణుమాధవరావు, కార్యదర్శులు నాగిరెడ్డి, సత్యనారాయణ, స్థానిక సర్పంచ్ పిడిగం నాగయ్య ఉన్నారు. -
సిరిసిల్ల జిల్లా కోసం సర్పంచ్ రాజీనామా
సిరిసిల్ల రూరల్: సిరిసిల్ల జిల్లా చేయాలని డిమాండ్‌తో ప్రభుత్వ తీరును నిరసిస్తూ సిరిసిల్ల మండలం తాడూరు గ్రామ సర్పంచ్ గుర్రం వెంకటలక్ష్మీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా పత్రాలను సిరిసిల్ల పట్టణంలోని కోర్టు ముందు అడ్వకేట్ జేఏసీ దీక్షా శిబిరంలో ప్రదర్శించారు. తన రాజీనామా పత్రాన్ని ఎంపీడీవో, డీపీవోకు పంపించనున్నట్లు తెలిపారు. దీంతో గుర్రం వెంకటలక్ష్మీ పదవీ త్యాగాన్ని అడ్వకేట్ జేఏసీ నాయకులు ఆవునూరి రమాకాంత్, మహేశ్‌గౌడ్, ధర్మేందర్, కోడి లక్ష్మణ్, కుంట శ్రీనివాస్ అభినందించారు. ఇప్పటికైన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇండ్లలో నుంచి బయటకు రావాలని, గుర్రం వెంకటలక్ష్మీ లాగా పదవులు త్యాగం చేస్తే జిల్లా సాధ్యమన్నారు. సిరిసిల్ల జిల్లా ప్రకటించే వరకు పోరాడుతామని తాడూరు సర్పంచ్ గుర్రం వెంకటలక్ష్మీ తెలిపారు. -
మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం
ఖననం చేసిన తరువాత మృతిపై అనుమానం పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి భార్య పోరండ్లలో తహసీల్దార్ సమక్షంలో విచారణ తిమ్మాపూర్ : మండలంలోని పోరండ్ల గ్రామానికి చెందిన పార్నంది చంద్రయ్య(55) మృతిపై అతడి భార్య అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసుకు ఫిర్యాదు చేయడంతో ఖననం చేసిన మృతదేహాన్ని ఆదివారం వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించడం చర్చనీయాంశమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార ం.. చంద్రయ్య బ్రాస్‌బ్యాండ్ కూలీగా పనిచేసేవాడు. ఈనెల 15న ఉదయం చంద్రయ్యను పోరండ్లకు చెందిన కిన్నెర రాజయ్య బ్యాండ్ పని కోసం తీసుకెళ్లాడు. రాత్రి వరకు చంద్రయ్య ఇంటికి రాలేదు. అదే రోజు సాయంత్రం సుభాష్‌నగర్ సమీపంలోని శివాజీనగర్ వద్ద పడిపోయి ఉండగా స్థానికులు 108కి సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చే చూసేసరికి చంద్రయ్య చనిపోవడంతో పోలీసులు శవాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మరునాడు మృతుడిని పోరండ్లకు చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. తన భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు భావిస్తూ ఎలాంటి అనుమానాలు లేవని భార్య పార్నంది లక్ష్మీ పోలీసులకు లిఖితపూర్వంగా రాసిచ్చింది. శవాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి అదే రోజు రాత్రి ఖననం చేశారు. అయితే చంద్రయ్యతోపాటు మరో ఇద్దరు వాహనంపై వెళ్లినట్లు, ఆ తరువాత కొద్ది సేపటికే అతను పడిపోయినట్లు స్థానికులు మృతుడి కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో చంద్రయ్యను ఇంటి నుంచి తీసుకెళ్లిన కిన్నెర రాజయ్యపై, వాహనంపై తీసుకెళ్లిన వ్యక్తులపై అనుమానం ఉందని ఈనెల 20న లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆదివారం కరీంనగర్ ట్రాఫిక్ ఎస్సై ఎం.రమేష్, తిమ్మాపూర్ తహసీల్దార్ కోమల్‌రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు అర్చన, ట్రాఫిక్ ఏఎస్సై ఇషాక్, ఎల్ఎండీ హెడ్‌కానిస్టేబుల్ హన్మంతరావు పోరండ్లకు చేరుకుని ఖననం చేసిన మృతదేహాన్ని కుటుంబసభ్యుల సమక్షంలో బయటకు తీయించి, పోస్టుమార్టం నిర్వహించారు. చంద్రయ్యను తీసుకెళ్లిన వ్యక్తులు అతడు పడిపోయిన విషయాన్ని తమకు తెలుపకపోవడంపై అనుమానం ఉందని తహసీల్దార్‌కు లక్ష్మి ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపడుతామని ఎస్సై రమేష్ తెలిపారు. పోస్టుమార్టం స్థలానికి సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బోయిని అశోక్, ఒగులాపూర్ సర్పంచ్ జయపాల్‌రెడ్డి తదితరులు వచ్చి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను కోరారు. -
శ్రమజీవనం.. కళాపిపాసుల సౌందర్యం
జానపదం ముద్దుబిడ్డలు కళకు జీవం పోస్తున్న కళాకారులు నేడు ప్రపంచ రంగస్థల, జానపద విజ్ఞాన దినోత్సవం వారు శ్రమజీవు.. ఒగ్గుకథలో ప్రావీణ్యం పొందారు.. జానపదాలు స్మరిస్తూ శ్రామికులకు వినోదం పంచుతున్నారు. ఆదరణ కోల్పోతున్న కళలకు జీవం పోస్తూ కళామతల్లి సేవలో తరలిస్తున్నారు. రెండున్నర గంటలపాటు వినోదం అందించే సినిమాను తలదన్నే రీతిలో ఏకంగా ఎనిమిది గంటలపాటు ఒగ్గుకథను అలవోకగా గానం చేస్తూ ‘ఔరా’ అనిపిస్తున్నారు. ఒగ్గుకథ పితామహుడు మిద్దె రాములు శిష్యులు ఇప్పుడు బోనమెత్తుతున్నారు. సోమవారం ప్రపంచ జానపద విజ్ఞాన, రంగస్థల దినోత్సవం సందర్భంగా కథనం.. – కోనరావుపేట కళకు జీవం పోస్తూ.. ఒగ్గుకథా కళాకారుల ప్రతిభ మహా అద్భుతం. విభిన్న పాత్రలకు జీవం పోస్తూ.. కళామతల్లి సేవకు అంకితమవుతున్నారు. టీవీలు, సినిమాలు, సోషల్ మీడియా నుంచి పోటీ ఎదురైనా వెనుకడుగు వేయడంలేదు. అందని ప్రోత్సాహం సుమారు 80–90 వరకు పురాణ గాథలను అనర్గళంగా ప్రదర్శించే కళాకారులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైంది. ప్రదర్శనలకు ఆహ్వానించేవారు కరువయ్యారు. ఆర్థిక పరిస్థితి క్షీణించి కళాకారులు దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. వృద్ధ కళాకారులకు పింఛన్లు అందింది ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ విషయమే పట్టించుకోవడంలేదు. ఒగ్గుకథకు జీవం పోస్తున్న శంకర్ ఆయన పెద్దగా చదువుకోలేదు. గురువు వద్ద నేర్చుకున్నదీ తక్కువే. అతను కథలను పుస్తకాలలో చూసుకుంటూ చెప్పలేడు. రజక వృత్తిలో ఉన్నా ఒగ్గుకథనే తన కులవృత్తిగా ఎంచుకున్నాడు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ఒగ్గుకథ చెబుతూ అంతరించిపోతున్న కళలకు జీవం పోస్తున్నాడు. పలు ప్రభుత్వ, ప్రైవేట్ పథకాల ప్రచారం కోసం కథలు చెబుతూ జీవనం సాగిస్తున్నాడు. పలువురి ప్రశంసలను అందుకుంటున్నాడు మారుపాక శంకర్. కనగర్తికి చెందిన మారుపాక శంకర్ మిద్దె రాములు శిష్యుడు. మారుపాక ముత్తయ్య–లచ్చవ్వ దంపతుల నాలుగో సంతానం శంకర్. తండ్రి బట్టలుతికేవాడు. ఒకసారి మిద్దె రాములు ఒగ్గుకథ చెప్పడానికి గ్రామానికి వెళ్లారు. ఆయన కథ, చెప్పిన విధానం నిశితంగా పరిశీలించిన శంకర్ ఒగ్గుకథపై ఆసక్తి పెంచుకున్నాడు. మిద్దె రాములు బృందంలో చేరి గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ కథలు చెప్పడం నేర్చుకున్నాడు. సుమారు వంద కథలు అనర్గళంగా చెప్పడం నేర్చుకున్న తర్వాత.. తానే స్వయంగా ప్రదర్శనలివ్వడం ప్రారంభించాడు. రేణుకా ఎల్లమ్మ, మల్లన్న, బీరప్ప, నల్లపోచమ్మ, భక్త పుండరీక, సత్యహరిశ్చంద్ర, సత్యసావిత్రిలాంటి కథలు ఎక్కడా చదవకుండా, చూడకుండా ప్రదర్శన ఇస్తాడు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్మభూమి తదితర పథకాలలో ఒగ్గుకథను ప్రదర్శించి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. ప్రభుత్వాధికారులు ఎయిడ్స్, కుటుంబనియంత్రణ వంటి కార్యక్రమాలలో శంకర్‌చే ఒగ్గుకథల ప్రదర్శర నలు ఇప్పించారు. ఇప్పటి వరకు సుమారు వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. ఇటీవలి తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఉత్తమ కళాకారునిగా అవార్డు పొందాడు. రాణిస్తున్న బీరయ్య కనగర్తి గ్రామానికి చెందిన జాప మల్లయ్య–దేవవ్వ దంపతుల కుమారుడు బీరయ్య. గజ్జె కట్టి గళం విప్పితే వేదిక సందడి చేస్తుది. నిరక్షరాస్యుడైన బీరయ్య.. తలపై బోనం ఎత్తితే శివసత్తుల సిగాలతో ఊరూరా జాతరే. తలపై బోనం ఎత్తుకుని నాట్యమాడుతూ నేలపై ఉన్న నాణాన్ని నాలుకతో అందుకోవడం ఆయన ప్రత్యేకత. బీరయ్య చిన్నతనం నుంచి ఒగ్గుకథపై మక్కువ పెంచుకున్నాడు. హన్మాజీపేటకు చెందిన ఎరుకలి పోచయ్య, వేములవాడకు చెందిన బుగ్గయ్య వద్ద శిష్యుడిగా చేరి కొంత కాలం శిక్షణ పొందాడు. సుమారు 90 కథలు నేర్చుకుని సొంతంగా కథలు చెప్పడం ప్రారంభించాడు. మల్లన్న, ఎల్లమ్మ పట్నాలు వేయడంలో నేర్పరి. 22 ఏళ్లుగా ఒగ్గుకథకే అంకితమయ్యాడు. అనేక ప్రదర్శనలు ఇస్తున్నాడు. ఏడేళ్ల క్రితం తెలంగాణ ధూంధాంలో ఒగ్గుకథ చెప్పి కేసీఆర్ ద్వారా సన్మానం పొందాడు. సిద్దిపేట, మంథని, వరంగల్, మంచిర్యాల, గోదావరిఖని తదితర ప్రాంతాల్లో ఒగ్గుకథ ప్రదర్శనలు ఇచ్చాడు. కథలు చెప్పడమే తన జీవనాధారమని బీరయ్య పేర్కొన్నాడు. -
త్వరలో అర్బన్ మండలాల ఏర్పాటు..!
– రెవెన్యూ డివిజన్ కేంద్రంగా డోన్ –కసరత్తు చేస్తున్న ప్రభుత్వం కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు నగరపాలక సంస్థ సహా మున్సిపాలిటీ కేంద్రాలను అర్బన్ మండలాలుగా గుర్తించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అదే విధంగా జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ముందుగా కర్నూలు నగరాన్ని అర్బన్ మండలంగా గుర్తించనున్నట్లు సమాచారం. నగరంలో 5 లక్షలకు పైగా జనాభా ఉండటంతో అర్బన్ మండలంగా గుర్తించాలనే ప్రతిపాదన కొన్నేళ్లుగా ఉంది. ఎట్టకేలకు ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఏర్పడింది. కర్నూలును అర్బన్ మండలంగా గుర్తించిన తర్వాత నంద్యాల, ఆదోని మున్సిపాలిటీలను కూడా అర్బన్ మండలాలుగా గుర్తించనున్నారు. ఆ తర్వాత డోన్, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, బనగానపల్లెలను ఆర్బన్ మండలాలుగా గుర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు అర్బన్ మండలాలు లేకపోవడం గమనార్హం. -
జేసీ దివ్య సుడిగాలి పర్యటన
అష్ణగుర్తి (వైరా): మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని నీడను ఇచ్చే చేట్టు తల్లిలా కాపాడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ దివ్య అన్నారు. బుధవారం మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. అష్ణగుర్తి గ్రామంలోని జెడ్పీఎస్ఎస్ ఉన్నత పాఠశాలలో హరితహారం కార్యక్రమంలో మొక్కలను నాటి అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. పాఠశాల ఆవరణ, గ్రామం పచ్చగా ఉండాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. అనంతరం పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం కట్టెల పోయ్యిమీద కాకుండా గ్యాస్ పొయ్యి మీద వండాలని, గ్రామంలో నూరు శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బొర్రా ఉమాదేవి, ఎంపీపీ బొంతు సమత, సర్పంచ్ గుమ్మా చంద్రకళ, తహసీల్దార్ డి.సైదులు, ఎంపీడీఓ జి మదుసుదన్‌రాజు, ఎంఈఓ వెంకటేశ్వరరావు, ఆర్ఐ నళిన్ కుమార్, పంచాయితీ కార్యదర్శి సీహెచ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
‘బాటల’ మాటున బూటకం
అమలాపురం : ‘సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది’అన్నట్టుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీరు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు తన ఖాతాలో వేసుకునేందుకు కొత్త పథకానికి తెర తీసింది. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయాపైసా కూడా విడుదల కాదు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులు నిలిపివేసి ఆ సొమ్ములకు త్వరలో వచ్చే 14వ ఆర్థిక సంఘం నిధులను, గ్రామ, మండల, జిల్లా పరిషత్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను కలిపి ఈ రోడ్లకు వినియోగించాలనుకుంటోంది. తూర్పుగోదావరి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గ్రామాల్లో విరివిగా సీసీ రోడ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేజర్,మీడియం పంచాయతీల్లో కనీసం కిలో మీటరు నిడివితో సీసీ రోడ్ల నిర్మాణం చేయనున్నారు. పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం వరకు బాగానే ఉన్నా.. సీసీ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయాపైసా కూడా విడుదల కాకపోవడం గమనార్హం. 13వ ఆర్థిక సంఘం నిధులతో ఇప్పుడు జరుగుతున్న పనులను అర్ధాంతరంగా నిలిపివేయాలని, త్వరలో విడుదల కానున్న 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎన్ఆర్ఈజీఎస్, జెడ్పీ, మండల పరిషత్ నిధులతో సీసీ రోడ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. ఒక్క పైసా కూడా విడుదల చేయకుండా స్థానిక సంస్థలకు కేంద్రం వచ్చిన నిధుల మీద రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం ఏమిటని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టకుండా వివిధ కారణాల వల్ల ఆలస్యమైన పనులు నిలిపివేయాలని, ఈ మేరకు జిల్లా కలెక్టర్లు సర్క్యులర్ ఇవ్వాలని ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్ శాఖమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశాలు జారీ చేశారు. దాంతో కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్ని పంచాయతీలకు సర్క్యులర్ జారీ చేయగా సర్పంచ్‌లు మండిపడుతున్నారు. యూక్షన్ ప్లాన్ మాటున తమ వారికే పనులు.. గ్రామ పంచాయతీల్లో చేపట్టే సీసీ రోడ్ల నిర్మాణ పనులను గుర్తించి యాక్షన్ ప్లాన్ తయారు చేసి పంపించాల్సిందిగా సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఎంపీడీవోలు ఈ మేరకు పనులు గుర్తించి పంచాయతీరాజ్ శాఖకు పంపుతున్నారు. ఇప్పటికే చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు మండలాల వారీగా సర్పంచ్‌లకు, కార్యదర్శులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఎంపిక చేసిన పనులు, నిధులపై ఆరా తీయడంతోపాటు, తమకు కావాల్సిన వారికి, నచ్చిన ప్రాంతాల్లో పనులు కట్టబెట్టేలా సిఫార్సులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు చాలా పంచాయతీల్లో ఇంకా ఖర్చు కాలేదు. గ్రామంలో జనాభాను బట్టి మనిషికి రూ.279 చొప్పున 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కానున్నాయి. పంచాయతీని బట్టి రూ.2.50 లక్షల నుంచి రూ.65 లక్షల వరకు రానున్నాయి. ఇలా ప్రతి నియోజకవర్గంలో రూ.13 కోట్లకు పైగా నిధులు రానున్నాయి. వీటికి ఉపాధి హామీ పథకం, జెడ్పీ, మండల పరిషత్ నిధులు, పంచాయతీ నిధులు కలిపితే నియోజకవర్గంలో కనీసం రూ.15 కోట్లకు పైగా నిధులతో రోడ్ల పనులు చేపట్టే అవకాశముంది. ఇదే అధికార పార్టీ ఎమ్మెల్యేలను బాగా ఆకర్షిస్తోంది. ఎమ్మెల్యేలు లేని చోట టీడీపీ ఇన్చార్జిలు చెప్పిన చోట, వారు ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే రోడ్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల నిర్వీర్యానికే.. ఇలా చేయడం ద్వారా ఎమ్మెల్యేలకు పలు రకాల ప్రయోజనాలు కలగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఏసీడీపీ నిధులు విడుదల చేయడం మానేసింది. ఎన్నికై ఏడాది దాటినా తాము ఫలానా మేలు చేశామని చెప్పుకునేందుకు ఏమీ కనిపించడం లేదు. ప్రస్తుతం వివిధ నిధులతో చేపట్టే సీసీ రోడ్ల పనులు తామే చేయించామని చెప్పుకునేందుకు వీలు చిక్కుతోంది. పనుల కేటాయింపులకు సిఫార్సు లేఖలు ఇవ్వడం ద్వారా పర్సంటేజీలు రాబట్టుకోవచ్చు. ప్రతిపక్షానికి చెందిన సర్పంచ్‌లున్న చోట వారి ప్రణాళికతో సంబంధం లేకుండా తమ పార్టీ నాయకుల సిఫార్సుల మేరకు రోడ్లు ఎక్కడో నిర్ణరుుంవచ్చు. ప్రభుత్వం ఈ ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుందని, తద్వారా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందని సర్పంచ్‌లు మండిపడుతున్నారు. దీనిపై అధికార పార్టీ సర్పంచ్‌లు కూడా ఆగ్రహంతో ఉండడం కొసమెరుపు. అభివృద్ధి కుంటుపడుతుంది.. ఆర్థిక సంఘం నిధుల్ని ప్రభుత్వం సీసీ రోడ్లకు మళ్లిస్తే పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడుతుంది. ఇప్పటికే పంచాయతీలు నిర్వీర్యం అయిపోయాయి. కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులతోనే తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ బిల్లులు కట్టుకుంటున్నాం. ఇప్పుడు వాటినీ లాక్కుంటే అవన్నీ కష్టమవుతారుు. - నక్కా సంపత్‌కుమార్, సర్పంచ్, ఈదరపల్లి, అమలాపురం రూరల్ రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదు.. ఆర్థిక సంఘం నిధులపై పెత్తనం చలాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులేదు. ఈ నిధులు పంచాయతీల్లో పాలవర్గాల తీర్మానాల మేరకే ఖర్చు చేయాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సర్పంచ్‌లందరూ కలిసి తీర్మాణాలు చేయనున్నాం. - బొంతు విజయకుమారి, సర్పంచ్, ఇందుపల్లి, అమలాపురం రూరల్ -
తెరపైకి 12 రెవె‘న్యూ’మండలాలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : రెవెన్యూ మండలాల పునర్విభజనపై జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) అదర్‌సిన్హా నేతృత్వంలో కొత్త రెవెన్యూ డివిజన్లు/ మండలాలపై కలెక్టర్లు సమర్పించిన ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించింది. ఈ క్రమంలోనే మన జిల్లాలో నూతనంగా మరో 12 పట్టణ రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రఘునందన్‌రావు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. నగరీకరణ నేపథ్యంలో శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరించడం, ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం వలసలు కూడా పెరిగిపోవడమేగాకుండా.. భూముల విలువలు కూడా అనూహ్యంగా పెరిగినందున పట్టణ ప్రాంతాల్లో మండలాలను పున ర్వ్యస్థీకరించాల్సిన అవసరముందని తేల్చిచెప్పారు. 2007 నుంచి రెవెన్యూ డివిజన్లు/ అర్బన్ మండలాలను పెంచాలనే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నప్పటికీ, 2013, జూన్‌లో కేవలం రాజేంద్రనగర్, మల్కాజిగిరి రెవెన్యూ డివిజన్లను మాత్రమే ఏర్పాటుచేసి.. కొత్త మండలాలను ఏర్పాటు చే యలేదనే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో నూతనంగా 12 అర్బన్ రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటికే జిల్లాలో 37 రెవెన్యూ మండలాలున్నాయని, ఈ మండలాల్లో పరిధి విస్తారంగా ఉండడంతో సిబ్బందిపై పనిభారం పెరిగిందని, ప్రభుత్వ భూముల పరిరక్షణ కూడా కష్టంగా మారినందున అదనపు సిబ్బంది అవసరమనే విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లింది. అధికారంలోకి వస్తే రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్విభజిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో.. తాజాగా డివిజన్లు/ మండలాల పునర్వ్యస్థీకరణపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. భవిష్యత్తులో ఏర్పడే జిల్లాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా న్యూ మండలాల ఏర్పాటు ఉంటుందని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం మండలం- ప్రతిపాదిత మండలాలు మల్కాజిగిరి- మల్కాజ్గిరి, అల్వాల్ కుత్బుల్లాపూర్- కుత్బుల్లాపూర్, దొమ్మరపోచంపల్లి శామీర్‌పేట- శామీర్‌పేట, జవహర్‌నగర్ ఉప్పల్ - ఉప్పల్, కాప్రా శంషాబాద్ - శంషాబాద్, పెద్దషాపూర్ బాలానగర్ - బాలానగర్, కూకట్పల్లి హయత్‌నగర్- హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ సరూర్‌నగర్ - సరూర్‌నగర్, మీర్పేట్ శేరిలింగంపల్లి- శేరిలింగంపల్లి,మదాపూర్/కొండాపూర్ రాజేంద్రనగర్- రాజేంద్రనగర్, నార్సింగి