
పంటపోయింది.. అప్పుమిగిలింది..
పంటపోయింది.. అప్పుమిగిలింది..
మండలంలో అప్రకటిత విద్యుత్ కోతలతో బోరు బావుల కింద వేసిన వరి నారుమడులకు నీరందక ఎండిపోతున్నాయి. వేరుశెనగ పీకడానికి రాకపోవడంతో అలాగే వదిలేశారు.
రైతులకు ఏడు గంటలు విద్యుత్ అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఎక్కడా అమలు కావడం లేదు. పంటల సాగు కోసం చేసిన పెట్టుబడులు రాలేదు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.