
గ్రామాల్లో కోతుల బెడద
దుగ్గిరాల, : మండలంలో కోతుల బెడద ఎక్కువైంది. కోతులు గుంపులుగా తిరుగుతూ సపోట, అరటి తోటలకు నష్టం కల్గిస్తున్నాయి. చేతికి వచ్చిన పంట నేలపాలుకావడంతో రైతులు నష్టపోతున్నారు. గుంపులు, గుంపులుగా గ్రామాల్లో ప్రవేశించి ఇళ్లపై దూకుతూ, వీధుల వెంట తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. పాఠశాలలకు వెళ్లే చిన్నపిల్లలు, కూలి పనులకు వెళ్లే మహిళలు, చేతి సంచితో ఊరు ప్రయాణాలు చేసేవారిని కోతులు ఆటంకపరుస్తున్నాయి.
రేవేంద్రపాడులో గురువారం రోడ్డున వెళ్తున్న ఓ మహిళపై కోతి దూకి కరిచే ప్రయత్నం చేసింది. మహిళ తప్పించుకుని ప్రమాదం నుంచి బయటపడింది. దుగ్గిరాల ఎస్సీ కాలనీలో ఓ చిన్నారి కోతి కాటుకు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు స్థానికులు చెప్పారు. ఇలా ప్రతి గ్రామంలోను కోతులు స్వైరవిహారం చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. పాలకులు, అధికారులు స్పందించి కోతులు సమస్య తొలిగిపోయేట్టు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.