బెంగళూరు : భారత్‌లో తాజాగా మరో మంకీ పాక్స్ (mpox) కేసు నమోదైంది. దుబాయ్ నుంచి భారత్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిలో మంకీ పాక్స్ లక్షణాలు వెలుగులోకి వచ్చాయి.
జనవరి 17న బాధితుడు దుబాయ్ నుంచి భారత్‌లోని కర్ణాటక రాష్ట్రం మంగళూరు నగరానికి వచ్చాడు. వచ్చిన కొద్ది రోజులకే అతడి శరీరంపై దద్దుర్లు, జ్వరంతో పాటు ఇతర మంకీ పాక్స్ లక్షణాలు కనిపించాయి. వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. సదరు ఆస్పత్రి వైద్యులు బాధితుడి లక్షణాలపై అనుమానం రావడంతో కర్ణాటక (karnataka) వైద్యఆరోగ్యశాఖకు సమాచారం అందించారు.
అప్రమత్తమైన వైద్యఆరోగ్యశాఖ బాధితుడి రక్త నమోనాలను సేకరించారు. వాటిని పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్‌లో బాధితుడికి మంకీ పాక్స్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం బాధితుడు, అతని కుటుంబ సభ్యుల్ని ఐసోలేషన్ వార్డ్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
మంకీపాక్స్ నమోదు కావడంపై వైద్యులు స్పందించారు. కోవిడ్-19తో పోలిస్తే మంకీపాక్స్ ప్రమాద తీవ్రత చాలా తక్కువ. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎయిర్‌పోర్టులో మంకీ పాక్స్ సోకిన బాధితుణ్ని ఎవరు ఆలింగనం చేసుకున్నారో.. వారందరిని ఐసోలేషన్ వార్డ్‌కు తరలించాం. త్వరలో వారిని డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment