ఏ కన్నతల్లి బిడ్డడో!
Published Mon, Sep 19 2016 12:53 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
మక్తల్ : ఎక్కడి నుంచి దారితప్పి వచ్చిన పన్నెండేళ్ల ఈ బాలుడిది ఏ ఊరో తెలియడంలేదు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఉదయం మండలంఓని చిన్నగోప్లాపూర్‌కు చెం దిన కుమ్మరి ఆంజనేయులు సొంత పనిమీద బైక్‌పై మక్తల్ పట్టణానికి వచ్చాడు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలోని కర్ని–పంచలింగాల రోడ్డు వెంట ఓ బాలుడు నడుచుకుంటూ వస్తుండగా గమనించి ఆపి చేరదీశాడు. పేరు అడిగితే వెంకటేష్ అని, తల్లిదండ్రులు జయమ్మ, రాములు అన్నాడు. ఊరు పేరు చిన్నగోప్లాపూర్ అని చెప్పగా గ్రామస్తులతో ఆరా తీస్తే కాదన్నారు. ఈ విషయమై సోమవారం పోలీసులకు సమాచారం అందిస్తామన్నారు.
Advertisement
Advertisement