56 మండలాల్లో వర్షం
Published Sat, Oct 8 2016 11:06 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ అగ్రికల్చర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా జిల్లాలోని 56 మండలాలలో వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా నేరేడుచర్ల మండలంలో 69.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అదే విధంగా మఠంపల్లి మండలంలో 40.2, వేములపల్లిలో 39.4, అనుములలలో 32.6, గరిడేపల్లిలో 31.6, మేళ్లచెరువులో 30.8, మిర్యాలగూడలో 30.4, త్రిపురారంలో 29.4, నిడమనూరులో 29.2, గుర్రంపోడులో 27.2, రాజాపేటలో 15.6, పీఏపల్లిలో 13.2, కట్టంగూరులో 11.4, భువనగిరిలో 11.2, తుర్కపల్లిలో 10.4, పెద్దవూరలో 10.4, వలిగొండలో 10.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అదే విధంగా నారాయణపురంలో 9.8, మోత్కురులో 9.0, తిప్పర్తిలో 9.0, దేవరకొండలో 9.0, యాదగిరిగుట్టలో 8.6, మునుగోడులో 8.4, గుండాలలో 7.6, కనగల్‌లో 7.4, హుజూర్‌నగర్‌లో 7.2, జాజిరెడ్డిగూడెంలో 7.2, తిరుమలగిరిలో 6.8, చండూరులో 6.6, ఆలేరులో 6.4, నూతన్‌కల్‌లో 6.4, కోదాడలో 6.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే బొమ్మలరామారంలో 6.0, బీబీనగర్‌లో 4.6, నార్కట్‌పల్లిలో 4.4, ఆత్మకూరు(ఎస్)లో 4.2, శాలిగౌరారంలో 4.0, నల్లగొండలో 3.6, ఆత్మకూరులో 3.4, మర్రిగూడలో 3.2, తుంగతుర్తిలో 3.2, చిట్యాలలో 3.0, నాంపల్లిలో 2.4, దామరచర్లలో 2.4, పోచంపల్లిలో 2.2, మునగాలలో 2.2, నడిగూడెంలో 2.0, నకిరేకల్‌లో 1.6 చింతపల్లిలో 1.4, సూర్యాపేటలో 1.4, చందంపేటలో 1.2, చివ్వెంలలో 1.2, పెన్‌పహడ్‌లో 1.2, చిలుకూరులో 1.0, కేతెపల్లిలో 0.2, మోతేలో 0.2, మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 10.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Advertisement