సైన్స్, సమాజం రెండూ ఒక్కటే
Published Sun, Dec 11 2016 11:32 PM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM
భానుగుడి (కాకినాడ):
సైన్స్ , సమాజం వేరు కాదని అవి రెండూ విడివిడిగా అభివృద్ధి చెందవని, సైన్స్ ఫలితాలు సమాజ పరం చేయాలనే కృతనిశ్చయంతో జేవీవీ పనిచేస్తుందని చెకుముకి జిల్లాస్థాయి సై¯Œ్స సంబరాల్లో వక్తలు అభిప్రాయపడ్డారు. జిల్లా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం శ్రీనగర్ ఆదిత్య పాఠశాలలో నిర్వహించిన చెకుముకి పరీక్షలో వివిధ మండలాల నుంచి తెలుగు మీడియంలో 50, ఇంగ్లిషు మీడియంలో 60 బృందాలు పాల్గొన్నాయి. తొలి ఐదు స్థానాలలో ఉన్న విద్యార్థులకు క్విజ్ నిర్వహించి మొదటి మూడు స్థానాలలో నిలిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
తెలుగు మీడియంలో విజేతలు : జెడ్పీ హైస్కూల్ కామరాజుపేట మొదటి, రవీంద్ర భారతి హైస్కూల్ ముమ్మిడివరం, మురమళ్ల జెడ్పీ హైస్కూల్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
ఇంగ్లిష్ మీడియం : ఆదిత్య హైస్కూల్ అమలాపురం విజేతగా నిలువగా, శ్రీప్రకాష్, శ్రీమతి జీఎండీ హైస్కూల్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇంగ్లిషు, తెలుగు విభాగాల్లో తొలిరెండు స్థానాల్లో నిలిచినవారు ఈ నెల 12, 13 తేదీలలో నెల్లూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని కేఎంఎంఆర్ ప్రసాద్ తెలిపారు. సభకు జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు కేఎమ్‌ఎమ్ ఆర్.ప్రసాద్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ స్టాలిన్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సీహెచ్ రవికుమార్, జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్ పి.చిరంజీవినికుమారి, సీనీయర్ నాయకులు బి.అనంతరావు, పి.నరసింహారావు, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎ¯ŒS.శృతిరెడ్డి, జేవీవీ సై¯Œ్స అండ్ టెక్నాలజీ కన్వీనర్ శ్రీకృష్ణసాయి, జి.వసంతకుమార్, కేసరి శ్రీనివాస్, రామారావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement