ఏనుగుల సంరక్షణ మన బాధ్యత
ఏనుగుల సంరక్షణ బాధ్యత మనందరిపైన ఉందని జూ పార్కు క్యూరేటర్ బి.విజయ్‌కుమార్ తెలిపారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని శుక్రవారం జూ పార్కులో అధికారులు నిర్వహించారు.
ఆరిలోవ: ఏనుగుల సంరక్షణ బాధ్యత మనందరిపైన ఉందని జూ పార్కు క్యూరేటర్ బి.విజయ్‌కుమార్ తెలిపారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని శుక్రవారం జూ పార్కులో అధికారులు నిర్వహించారు. పర్యావరణ మార్గదర్శి వైశాఖి సంస్థ, శ్రీప్రకాస్ విద్యార్థులతో కలసి జూ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఇక్కడ రాము అనే ఏనుగును అలంకరించారు. దాని మెడలో గంట కట్టి, కుంకుమతో నామాలు, బొట్లు పెట్టారు. జూలో ఏనుగుల ఎన్‌క్లోజర్ వద్ద విద్యార్థులతో ర్యాలీ చేపట్టి జూ బయోస్కోప్ వరకు సాగించారు. ఏనుగులను సంరక్షించాలని, అంతరించిపోతున్న వాటి జాతిని పరిరక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం జూ బయోస్కోప్‌లో ఏనుగులపై లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం క్యూరేటర్ విజయ్‌కుమార్ విద్యార్థులకు ఏనుగుల గురించి అవగాహన కల్పించారు. థాయ్‌లాండ్‌కు చెందిన ఎలిఫెంట్ రీ ఇంట్రొడక్షన్ ఫౌండేషన్ అనే సంస్థ ఏనుగుల పరిరక్షణ దినోత్సవాన్ని 2012, ఆగస్టు 12న ప్రారంభించిందన్నారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవంగా జరుపుతున్నారన్నారు. అడవుల్లో ఏనుగుల సంఖ్య బాగా తగ్గిపోతోందన్నారు. భూమిపై అతిపెద్ద జంతువైన ఏనుగు జాతి అంతరించిపోతుంటే రాబోవు తరాలవారికి దాని జాడ తెలయకుండాపోతుందన్నారు. ఏనుగుల్లో ఆసియా ఖండపు ఏనుగులు మరింత అంతరించిపోయే దశకు చేరాయన్నారు. ఏనుగుల దంతాలను ప్రపంచ వ్యాప్తంగా అలంకరణ వస్తువుగా వినియోగిస్తుండటంతో వాటికి మంచి గిరాకీ ఉందన్నారు. దీంతో లాబాపేక్షతో కొందరు వాటి దంతాల కోసం ఏనుగులను చంపేస్తున్నారన్నారు. గడిచిన 50 ఏళ్లలో ఆసియాలో 13 దేశాలలో 70 శాతం ఏనుగులు తగ్గిపోయాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ రిసోర్స్(ఐయూసీఎన్) నివేదికలో వెల్లyì ంచిందన్నారు. దీని రిపోర్టు ప్రకారం మన దేశంలో కూడా 50 శాతం ఏనుగులు తగ్గిపోయాయని వివరించారు. అందుకే ప్రతి ఒక్కరూ ఏనుగుల గురిచి తెలుసుకొని వాటి సంరక్షణకు కషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జూ అసిస్టెంట్ క్యూరేటర్లు మషాది, పి.వి రమణ, ఫారెస్టర్లు రమణ, సత్యం పర్యావరణ మార్గదర్శి ప్రతినిధులు జె.రాజేశ్వరి, జి.దేవిప్రసాద్, జూ లవర్స్ ప్రతినిధులు ఆర్.మనోహర్, జె.లిఖిత, రవితేజ , శ్రీప్రకాష్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.