నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం | World Biryani Day 2024 | Sakshi
Sakshi News home page

నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం

Published Sun, Jul 7 2024 9:19 AM | Last Updated on Sun, Jul 7 2024 9:36 AM

World Biryani Day 2024

రాహుల్‌గాంధీ రాజకీయాల్ని మరచిపోతారు.. సచిన్‌టెండూల్కర్‌ బ్యాటింగ్‌కు బదులు ఈటింగ్‌కి జై కొడతారు.. హైదరాబాద్‌ బిర్యానీ అంటే సెలబ్రిటీలకే సెలబ్రిటీ. శతాబ్దాల నాటి బిర్యానీ ఎప్పటికప్పుడు నగరాన్ని రుచుల విశ్వంలో రారాజుగా నిలబెడుతూనే ఉంది. నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం.. ఈ సందర్భంగా లొట్టలేస్తూ నెమరేసుకుందాం..మన బిర్యానీ..కహానీ..

దేశంలో అత్యధికంగా జనం ఆస్వాదిస్తోన్న ఆహారం బిర్యానీయే. అయితే అలా ఆర్డర్‌ ఇస్తున్న ప్రతి ఐదు బిర్యానీల్లో ఒకటి మనదేనట. ఆ విధంగా చూస్తే భాగ్యనగరం దేశానికి బిర్యానీ క్యాపిటల్‌గా మారిందన్నమాటే. దేశవ్యాప్తంగా సెకనుకు సగటున 2.5 బిర్యానీలు హాంఫట్‌ అవుతున్నాయట. గతేడాది నగరంలో 13 మిలియన్ల బిర్యానీలు స్విగ్గీ సర్వ్‌ చేసింది. అంటే అక్షరాలా కోటి 30లక్షలు.. నగరంలోని 1700కు పైగా రెస్టారెంట్లలో కేవలం ఒక్క స్విగ్గీ ద్వారా అమ్ముడవుతున్న బిర్యానీల సంఖ్యే ఇది. ఇక ఇతరత్రా మార్గాల ద్వారా జరిగే విక్రయాలను కలుపుకుంటే చెప్పనక్కర్లేదు. నగరంలో అమ్ముడయ్యే బిర్యానీల్లో తొలిస్థానం చికెన్‌ బిర్యానీ కాగా, రెండో స్థానం వెజ్‌ బిర్యానీ కావడం మరో విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో చికెన్‌ దమ్‌ బిర్యానీ, మటన్‌ బిర్యానీలు ఉన్నాయి. తాజాగా టేస్ట్‌ అట్లాస్‌ నిర్వహించిన ఓ  అధ్యయనంలో అత్యుత్తమ రుచుల్లో మన బిర్యానీ 6వ స్థానంలో నిలిచింది.  

బిర్యానీ అనే పదం పర్షియన్‌ భాషలోని బిరింజ్‌ నుంచి పుట్టింది. దీని అర్థం రైస్‌. బిర్యానీ మన దేశానికి 1398లో పరిచయం అయ్యిందట. హైదరాబాద్‌ నిజామ్స్, లక్నో నవాబులు బిరియానీ అంటే లొట్టలేసేవారట. మొఘలుల కాలంలో తరచూ యుద్ధాల్లో పాల్గొనే సైనికుల కోసం చేసిన ప్రత్యేక వంటకం ఇది. సైనికుల శక్తి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని మటన్, బియ్యం సమపాళ్లలో మేళవించి చెక్కల మంట మీద మసాలాలు, కుంకుమ పువ్వు దీనిలో కలిపి వండేవారట. నగరాన్ని పాలించిన నిజామ్‌ ఉల్‌ మల్‌్క.. బిర్యానీ విస్తరణ చరిత్రలో చెక్కుచెదరని పేరు తెచ్చుకున్నారు. స్థానిక వంటకాల శైలులను ఒకటొకటిగా కలుపుకుంటూ ఎన్నో కొత్త రుచులను అద్దుకుంది బిర్యానీ. ఇందులో నిజామ్స్‌ సృష్టించిన కచ్చి గోస్త్‌ బిర్యానీ ఒకటి. ఇటీవల మన దేశపు అగ్రగామి చెఫ్‌ సంజీవ్‌కపూర్‌ సైతం తన అభిమాన బిర్యానీ హైదరాబాద్‌లో పుట్టిన కచ్చి గోస్త్‌ బిర్యానీ గురించి చెప్పడం విశేషం.  

సిటీలో టాప్‌ బిర్యానీ సెంటర్లు ఇవే... 
ఏళ్ల నాటి నుంచి చారి్మనార్‌కు సమీపంలోని షాబాద్‌ హోటల్‌ బిర్యానీకి ఫేమస్‌. అదే క్రమంలో పాతబస్తీలోని దారుల్‌íÙఫాలోని నయాబ్, బంజారాహిల్స్‌లోని బిర్యానీ వాలా, హైదర్‌గూడలోని కేఫ్‌ బహార్, సికింద్రాబాద్‌లోని పారడైజ్, నారాయణగూడలోని మెహ్‌ఫిల్, టోలిచౌకిలోని షాగౌస్, ఫలుక్‌నుమా ప్యాలెస్‌లోని అదా, క్రాస్‌రోడ్స్‌లోని బావర్చి, పాతబస్తీలోని పిస్తా హౌజ్, పంజాగుట్టలోని మెరిడియన్‌ రెస్టారెంట్‌... తదితర పేర్లు నగరంలోని బిర్యానీప్రియులకు నిత్య స్మరణీయం. ఇవన్నీ దశాబ్దాలుగా బిర్యానీ ఫేవరెట్స్‌ కాగా.. ఇటీవలి కాలంలో మరికొన్ని రెస్టారెంట్స్‌ అత్యాధునిక హంగులతో రుచికరమైన బిర్యానీలను వడ్డిస్తున్నాయి.  

బహురూపాల్లో...

 బిర్యానీని సాధారణంగా  హండి లేదా కుండలో వండడం అనేది ఏళ్లనాటి సంప్రదాయం. కానీ కుండలోనే వడ్డిస్తూ, పార్సిల్స్‌ కూడా అందిస్తున్నారు. ఆ తర్వాత  డబ్బా బిర్యానీ వచి్చంది. ఇది కాంపాక్ట్‌ కంటైనర్‌లో అందించడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని మారేడు మిల్లి బొంగులో బిర్యానీకి ఫేమస్‌. వెదురు బొంగుల్లో వండిన బిర్యానీని అలాగే వడ్డిస్తూ టేక్‌ అవే ఇస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని స్పైసీ వెన్యూ రెస్టారెంట్‌లో ఎంఎల్‌ఏ పొట్లం బిర్యానీ పేరుతో ఆమ్లెట్‌లో చుట్టి వడ్డిస్తూ పార్సిల్స్‌ చేస్తున్నారు.   

 కొత్తగా బకెట్‌ బిర్యానీ వచి్చంది. ఎరుపు, తెలుపు, బ్లూ.. ఇలా అనేక రంగుల బిర్యానీ బకెట్లు నగరవాలుకు కలర్‌ఫుల్‌ ట్రీట్‌ అందుబాటులోకి తెచ్చాయి. నగరంలోని ఓ రెస్టారెంట్‌లో  బిర్యానీ–ఇన్‌–ఏ–వాటర్‌–వెస్సల్‌ కూడా రానుందని అంటున్నారు.   అంతే కాదు కోన్‌లో బిర్యానీ, పిజ్జాలో బిర్యానీ, సమోసాలో బిర్యానీ, బిర్యానీ సుషీ రోల్స్, బిర్యానీ ఫ్లేవర్‌ ఐస్‌ క్రీం వంటివి ఆన్‌ ద వే అట.

చవులూరించే వెరైటీలు... 
చికెన్, మటన్, వెజిటబుల్స్‌.. జోడించిన బిర్యానీలు ఓ వైపు లీడ్‌ చేస్తుండగా, నగరంలో ఉలవచారు బిర్యానీ, క్లాసిక్‌ హైదరాబాదీ బిర్యానీ, రిచ్‌ అండ్‌ క్రీమీ లక్నోవి బిర్యానీ. టాంగీ, ఫ్లేవర్‌ఫుల్‌ బాంబే బిర్యానీ వంటివి విభిన్న రకాల మేళవింపులతో అందుబాటులోకి వచ్చాయి.  చైనీస్‌– ఆధారిత ఫ్రైడ్‌ రైస్‌ బిర్యానీ లేదా మెక్సికన్‌–ప్రేరేపిత బురిటో బిర్యానీ ఫ్యూజన్‌ బిర్యానీ... ఇలా ఫుడ్‌ లవర్స్‌కి పదుల సంఖ్యలో ఎంపిక అవకాశాలు అందిస్తున్నారు.

మండీ వచి్చనా... ట్రెండీ మనదే..
నగరంలోని బార్కాస్‌ ప్రాంతంలో పేరొందిన మండీ...బిర్యానీకి గట్టి పోటీ ఇస్తుందని అంచనా. అరబ్బుల వంటకమైన మండీ.. నగరంలో వేగంగా విస్తరించింది. అలా దాదాపు ఎనిమిదేళ్ల నుంచీ మండీ హవా  మొదలైంది. అయితే ఇప్పటికీ బిర్యానీకి దరిదాపుల్లో కూడా రాలేకపోయిందంటే.. దటీజ్‌ హైదరాబాద్‌ బిర్యానీ అంటున్నారు సిటీ ఫుడ్‌ ఇండస్ట్రీ వర్గాలు.  

పొట్లం బిర్యానీ స్పెషల్‌
బిర్యానీ రుచి, నాణ్యతతో పాటు కంటైనర్స్‌ కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వెరైటీ కంటైనర్స్‌లో వడ్డించడం, పార్సిల్‌ చేయడం ద్వారా ఫుడ్‌ లవర్స్‌ని అట్రాక్ట్‌ చేస్తున్నారు. అయితే ఏదేమైనా ఫుడ్‌ క్వాలిటీ, టేస్ట్‌ ముఖ్యం. మా రెస్టారెంట్‌ స్పెషల్‌గా పొట్లం బిర్యానీ అందిస్తున్నాం.  ఆమ్లెట్‌లో చుట్టిన బిర్యానీని సిటీలో ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులోకి తెచ్చాం. – సంపత్, ద స్పైసీ  వెన్యూ రెస్టారెంట్‌

హైదరాబాద్‌ ఆవకాయతో.. అమెరికాలో బిర్యానీ..
నగరవాసులు అనేకమంది విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో  రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు. అక్కడ తెలుగువాళ్లు అధికంగా నివసించే చోట కూడా హైదరాబాద్‌ బిర్యానీ హల్‌చల్‌ చేస్తోంది. ‘మన ఇండియన్స్‌తో పాటు అమెరికన్లు కూడా హైదరాబాద్‌ బిర్యానీని బాగా ఇష్టపడతారు’ అంటూ చెప్పారు నగరంలోని మల్కాజ్‌గిరి ప్రాంతానికి చెందిన నగే‹Ù, సాయిప్రసాద్‌. ఈ బావా, బావమరుదులు ఇద్దరూ అమెరికాకు వలస వెళ్లి అక్కడ బావర్చి బిర్యానీ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ రెస్టారెంట్‌లో అందించే ఆవకాయ బిర్యానీ అక్కడ పాప్యులర్‌. దీని కోసం సునీత బంధువులు మల్కాజ్‌గిరిలో భారీ ఎత్తున ఆవకాయ పచ్చడి తయారు చేసి అమెరికాకు పంపిస్తున్నారు.  

తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకూ... 
థియేటర్లలో షోస్‌ టైమింగ్స్‌లాగే నగరంలోనూ బిర్యానీ దొరికే వేళలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. నైట్‌లైఫ్‌తో పాటే మిడ్‌నైట్‌ బిర్యానీలు కూడా పుట్టుకొచ్చేశాయి. అబిడ్స్‌లోని గ్రాండ్‌ హోటల్‌ అర్ధరాత్రి బిర్యానీ విందుకు చిరునామాగానూ, అలాగే చాదర్‌ఘాట్‌ మిడ్‌నైట్‌ బిర్యానీలకు కేరాఫ్‌గా మారాయి. కొన్ని స్టార్‌ హోటల్స్‌ బిర్యానీ ప్రియులకు అర్ధరాత్రుళ్లు తలుపులు తెరుస్తున్నాయి. అలాగే తెల్లవారుజామున 4 గంటలకే వేడివేడి బిర్యానీని అందించే ట్రెండ్‌ ఇటీవలే ఊపందుకుంటోంది. మాదాపూర్, గచ్చి»ౌలి, బోరబండ, వివేకానందనగర్‌.. ప్రాంతాల్లో సందడి కనిపిస్తోంది. కాల్‌ సెంటర్లు, మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీలు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు నైట్‌ షిఫ్ట్‌ను ఈ బిర్యానీతో ముగించడానికి అలవాటు పడుతున్నారు.

వుడ్‌ ఫైర్‌పై వండే  కేటరర్‌.. సూపర్‌..
నగరానికి చెందిన మహరాజ్‌ కేటరర్స్, ఎస్‌కె కేటరర్స్, ఎలిగెన్స్‌.. తదితర సంస్థలు వుడ్‌ ఫైర్‌ మీద వండి కేటరింగ్‌ చేస్తున్నారు. పెళ్లిళ్లు, వేడుకల్లో వీరి బిర్యానీలకు డిమాండ్‌ ఉంది. అలాగే హోటల్స్‌ విషయానికి వస్తే..బావర్చి, పంజాగుట్టలోని మెరిడియన్, ఫైవ్‌స్టార్‌ హోటల్‌ మారియట్‌లో బిదిరి అనే హైదరాబాద్‌ స్పెషల్‌ రెస్టారెంట్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఆస్టోరియా, పిస్తా హౌజ్‌లోని సాఫ్రాని బిర్యానీలు నా ఛాయిస్‌.  
–జుబైర్‌ అలీ, ఫుడ్‌ బ్లాగర్‌  

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement