● ● జిల్లాలో 20 రకాలకుపైగా బిర్యానీలు లభ్యం ● నిమిషానికి పది బిర్యానీలు ఆర్డర్ పెట్టి తింటున్న వైనం ●
శ్రీకాకుళం: బారసాల నుంచి దశ ది న కర్మల వరకు, పుట్టిన రోజు నుంచి పెళ్లిళ్ల వరకు ఫంక్షన్ ఏదైనా అటెన్షన్ అంతా బిర్యానీలదే. ఈ వంటకం ఎంతబాగా కుదిరితే కార్యం అంత చక్కగా జరిగినట్టు. అందులోనూ హైదరాబాదీ బిర్యానీ అంటే సిక్కోలు వాసులు లొట్టలేసుకుని తింటున్నారు. ఒకప్పుడంటే ఈ బిర్యానీ దొరకడం కష్టంగా ఉండేది గానీ.. ఇప్పుడు దాదాపు అన్ని ఊళ్లలోనూ బిర్యానీ సెంటర్లు కనిపిస్తున్నాయి. జిల్లాలో దాదాపు 20 రకాల బిర్యానీలు దొరుకుతున్నాయి. నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం.
వెజ్ అయినా.. నాన్‌వెజ్ అయినా..
ఎర్రటి మాంసం ముక్కలు కనిపిస్తే నే బిర్యానీ మజా ఇస్తుందనుకుంటే పొరపాటే.. పుట్టగొడుగుల నుంచి పన్నీరు వరకు, ఆవకాయ నుంచి గోంగూర వరకు పలు రకాల బిర్యానీలు చికెను, మటను బిర్యానీలకు గట్టి పోటీ ఇస్తున్నా యి. ఇటీవలే ప్లాంట్‌బేస్డ్ చికెన్, మటన్ పేరిట బిర్యానీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి శాకాహారమే. మాంసాహార విషయానికి వస్తే హైదరాబాదీ దమ్‌బిర్యానీతో పాటు పొట్లం బిర్యానీ, మటన్, ప్రాన్ బిర్యానీలంటూ రకరకాలు నోరూరిస్తున్నాయి.
రూ.100 నుంచి రూ.700లకు
పైబడి బిర్యానీ ధర ఉంది.
జిల్లాలో నిమిషానికి 10 బిర్యానీలు ఆన్‌లైన్
ఆర్డర్‌లు వస్తున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది.
హైదరాబాద్ బిర్యానీకే ఆదరణ
ఎన్నో రకాలు బిర్యానీలు ఉన్నా హైదరాబాద్ దమ్ బిర్యానీకి ఉన్న ఆదరణ ప్రత్యేకం. అన్ని బిర్యానీల్లో యాభై శాతం ఇవే వెళ్తాయి. వెజ్, నాన్ వెజ్‌ల బిర్యానీలలో దమ్‌కే ప్రథమస్థానం.
– తపన్‌కుమార్, బాబూరావు,చెఫ్‌లు
బిర్యానీ అంటే ఎంతో ఇష్టం
ప్రతి వారం చివర్లో బిర్యానీ తప్పక తింటాను. బిర్యానీ అంటే అంత ఇష్టం. ఆహార ప్రియు ల అభిరుచి మేరకు తయారీ దారులు కూడా రకరకాల రుచులను అందుబాటులోకి తెస్తున్నారు. ఇది మావంటి వారికి సంతోషం. – ఇప్పిలి సురేష్, శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment