పోస్ట్‌ పెయిడ్‌ యూజర్స్‌కి ఐడియా సూపర్‌ ఆఫర్‌ | Idea launches 1GB 4G data per day plan for postpaid users | Sakshi
Sakshi News home page

పోస్ట్‌ పెయిడ్‌ యూజర్స్‌కి ఐడియా సూపర్‌ ఆఫర్‌

Published Sat, Apr 1 2017 12:13 PM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM

పోస్ట్‌ పెయిడ్‌  యూజర్స్‌కి ఐడియా సూపర్‌  ఆఫర్‌

పోస్ట్‌ పెయిడ్‌ యూజర్స్‌కి ఐడియా సూపర్‌ ఆఫర్‌

న్యూఢిల్లీ: దేశీయ టెలికాం సంస్థ ఐడియా  సెల్యులర్‌   శుక్రవారం కొత్త ఆఫర్‌ ప్రకటించింది.  పోస్ట్‌ పెయిడ్‌ వినియోగదారుల కోసం  సరికొత్త ప్లాన్లను పరిచయం చేసింది.  దీని ప్రకారం 4జీ  మొబైల్‌ వినియోగదారులకు రోజుకి 1జీబీ 4జీ  డాటాను   అందించనుంది. లిమిటెడ్‌ రెంటెడ్‌ ప్లాన్స్‌లో  ప్రీ పెయిడ్‌ వినియోగదారులందరికీ ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నట్టు చెప్పింది. కొత్త ఐడియా ప్యాక్స్‌  రూ.199  నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈ కొత్త పథకం ప్రకారం రూ.499 ఆ పైన ప్లాన్‌లో రూ.300 విలువైన డేటా సేవలు ఉచితమని కంపెనీ చెబుతోంది.  కంపెనీ అందించిన సమాచారం ప్రకారం రూ.349- రూ.498లమధ్య రెంటల్‌ ప్లాన్‌ లో రూ.50 డిస్కౌంట్‌. అలాగే రూ.149-రూ.349 రెంటల్ ప్లాన్పై సబ్స్క్రైబ్ అయిన ఖాతాదారులకు రూ.100 డిస్కౌంట్‌ అందించనున్నట్టు తెలిపింది.

రూ. 300 యాడ్ ఆన్ ప్యాక్‌తో రోజుకు 1 జీబీ చొప్పున నెల రోజుల పాటు 4జీ డేటాను అందించనున్నట్లు తెలిపింది. రూ. 349 లేదా అంతకంటే ఎక్కువ రెంటల్ ఉన్న పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు రూ. 50 అదనంగా చెల్లించి మూడు నెలలపాటు ఈ ఆఫర్‌‌ను పొందొచ్చని ఐడియా స్పష్టం చేసింది. అలాగే మూడు నెలల తరువాత మార్చి 2018 వరకు ఈ  డిస్కౌంట్‌ ఆఫర్‌ పొందాలంటే రూ.199-రూ.349మధ్యప్లాన్‌లో అదనంగా  రూ. 200,  రూ.349- రూ.498  మధ్య ప్లాన్‌లో అదనంగా రూ.50 చెల్లిస్తే సరిపోతుందని  ఐడియా  తెలిపింది.  ఏప్రిల్ 30, 2017 వరకు దీని సబ్‌స్క్రిప్షన్‌  అందుబాటులో ఉండనుంది.  ఈ ఆఫర్‌ 4జీ హ్యాండ్‌సెట్లకు మాత్రమే.

పోస్ట్‌ పెయిడ్‌ వినియోగదారులకు ఈ తరహా భారీప్రయోజనాల ఆఫర్‌ అందుబాటులోకి తీసుకు రావడం ఇదే ప్రథమమని ఐడియా చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ శశి శంకర్‌తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement