ఐడియా బంపర్ ఆఫర్ | Idea launches 'Internet for All' initiative | Sakshi
Sakshi News home page

ఐడియా బంపర్ ఆఫర్

Published Wed, Jun 22 2016 4:08 PM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

ఐడియా  బంపర్ ఆఫర్

ఐడియా బంపర్ ఆఫర్

న్యూఢిల్లీ : ఇంటర్నెట్ వాడకానికి దూరంగా ఉంటున్న యూజర్లను ఆకట్టుకోవడానికి ఐడియా సెల్యులార్ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. "ఇంటర్నెట్ ఫర్ ఆల్" అనే ఆవిష్కరణతో ఇంటర్నెట్ వాడని యూజర్ల ముందుకు వచ్చింది. ఐడియా ప్రీపైడ్ కస్టమర్లు, రిటైలర్లకు నెలకు 100 ఎంబీ డేటా ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది. *756# కు డయల్ లేదా ఐఎఫ్ఏ అని 56756కు మెసేజ్ పంపినా ఈ సర్వీసు కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, షాపింగ్, ఎంటర్ టైన్ మెంట్, ఇతర యాక్సస్ లకు ఓ టూల్ లా వాడుతున్న ఇంటర్నెట్ గురించి యూజర్లు తెలుసుకునేలా ప్రోత్సహించడంలో ఈ ఆవిష్కరణ ఎంతో ఉపకరిస్తుందని ఐడియా సెల్యులార్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ తెలిపారు.

క్షేత్రస్థాయిలో ఇంటర్నెట్ సేవలు వినియోగం పెంచడానికి ఇది దోహదంచేస్తుందని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఇంటర్నెట్ లో కనెక్టు కాని స్నేహితుల, కుటుంబసభ్యులకు, ఇంటర్నెట్ యూజర్లు ఈ సర్వీసులను పరిచయం చేస్తారని వెల్లడించారు. దీంతో వారి జీవితాలను కొత్తపథంలో నడుస్తాయన్నారు. ఇంటర్నెట్ వరల్డ్ గూటికిందకు తన కస్టమర్లలందరినీ చేర్చాలనే ఉద్దేశంతో ఈ సేవలను ప్రారంభించినట్టు తెలిపారు. నాన్ ఇంటర్నెట్ యూజర్లు ఎలా ఈ ఉచిత డేటా సర్వీసులను అందిపుచ్చుకోవాలో పిరియాడిక్ గా యూజర్లకు సమాచారం పంపుతుంటామని ఐడియా చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement