న్యూఢిల్లీ: ఐడియా సెల్యులర్ కంపెనీ ఆకర్షణీయమైన రెండు ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌లను ఆఫర్ చేస్తోంది. పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ఈ రోమింగ్ ప్యాక్‌లు వర్తిస్తాయని కంపెనీ మంగళవారం తెలిపింది. డేటా చార్జీలు 90 శాతం, వాయిస్ టారిఫ్‌ల్లో 80 శాతం డిస్కౌంట్‌తో ఈ రోమింగ్ ప్యాక్‌లను అందిస్తున్నామని ఐడియా సెల్యులర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ తెలిపారు. రూ. 599 ప్యాక్ వ్యాలిడిటీ 10 రోజులని, రూ.1,499 ప్యాక్ వ్యాలిడిటీ 30 రోజులని పేర్కొన్నారు. అమెరికా, సింగపూర్, ఇంగ్లండ్, థాయ్‌లాండ్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ తదితర 40 దేశాలకు ఈ రోమింగ్ ప్యాక్‌లు వర్తిస్తాయని వివరించారు.
ఈ రెండు ప్యాక్‌ల్లో లోకల్, ఇంటర్నేషనల్ అవుట్ గోయింగ్ కాల్స్‌కు నిమిషానికి రూ.15, ఇన్‌కమింగ్ కాల్స్‌కు నిమిషానికి రూ.30 చొప్పున టారిఫ్ ఉంటుందని తెలిపారు. డేటా చార్జీల విషయానికొస్తే 1 ఎంబీకి రూ.30 చార్జ్ అవుతుందని వివరించారు. రూ.1,499 ప్యాక్‌లో ఇంటర్నేషనల్ రోమింగ్‌లో ఉన్నప్పుడు 30 నిమిషాల ఇన్‌కమింగ్ కాల్స్ ఉచితమని పేర్కొన్నారు. ఇంతకు ముందు ఇంటర్నేషనల్ కాల్ రేట్లు నిమిషానికి రూ.145 నుంచి రూ.185 గానూ, డేటా చార్జీలు 1 ఎంబీకి రూ.512 గానూ కంపెనీ చార్జ్ చేసేది.
ఐడియా ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్స్
Published Wed, Dec 4 2013 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM
Advertisement
Advertisement