
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం రంగంలో ఏర్పడిన విపరీతమైన పోటీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. రూ.299 పోస్ట్‌పెయిడ్ రీచార్జ్‌పై నెలకు 31జీబీ 4జీ డేటాను అందిస్తోంది. ఇందులో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజులు 100ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితం. ప్రత్యేకంగా కొత్త వినియోగదారులకోసం ఈ ప్లాన్‌ను లాంచ్ చేసింది. అయితే దీనికి అదనంగా జీఎస్‌టీని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే డేటా క్యారీ ఫార్వర్డ్ అవకాశం కూడా ఈ ప్లాన్‌లో లేదు. ముఖ‍్యంగా జియో, ఎయిర్‌టెల్ , వోడాఫోన్ ఐడియా ప్లాన్లకు సవాల్‌గా బీఎస్‌ఎన్‌ఎల్ ఈ సరికొత్త పోస్ట్‌పోయిడ్ ప్లాన్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment