Postpaid customers
-
బీఎస్ఎన్ఎల్ సరికొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం రంగంలో ఏర్పడిన విపరీతమైన పోటీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. రూ.299 పోస్ట్‌పెయిడ్ రీచార్జ్‌పై నెలకు 31జీబీ 4జీ డేటాను అందిస్తోంది. ఇందులో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజులు 100ఎస్ఎంఎస్లు కూడా ఉచితం. ప్రత్యేకంగా కొత్త వినియోగదారులకోసం ఈ ప్లాన్‌ను లాంచ్ చేసింది. అయితే దీనికి అదనంగా జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే డేటా క్యారీ ఫార్వర్డ్ అవకాశం కూడా ఈ ప్లాన్‌లో లేదు. ముఖ్యంగా జియో, ఎయిర్టెల్ , వోడాఫోన్ ఐడియా ప్లాన్లకు సవాల్‌గా బీఎస్ఎన్ఎల్ ఈ సరికొత్త పోస్ట్‌పోయిడ్ ప్లాన్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. -
ఎయిర్టెల్ ఉచితంగా 30జీబీ డేటా
టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ మరో కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. 4జీ స్మార్ట్‌ఫోన్‌లోకి అప్‌గ్రేడ్ అయ్యే తన ప్రస్తుత 2జీ, 3జీ కస్టమర్లకు ఉచితంగా 30జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. ఇది ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్’ కార్యక్రమంలో మరో ఆఫర్‌గా కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్ తన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లందరికీ వర్తించనుంది. కంపెనీ ఛార్జ్ చేసే ప్యాక్‌ల పైన రోజూ ఉచితంగా 1జీబీ డేటాను 30 రోజుల పాటు ప్రీపెయిడ్ కస్టమర్లు పొందనున్నట్టు కంపెనీ తెలిపింది. అదే పోస్టు పెయిడ్ కస్టమర్లైతే రోల్ఓవర్ సౌకర్యం కింద తొలి బిల్ సైకిల్లో ఉచితంగా 30జీబీ డేటాను పొందనున్నారు. అయితే ఈ ఉచిత డేటా ప్రయోజనాలను క్లయిమ్ చేసుకోవడానికి, అర్హతను చెక్ చేసుకోవడానికి 51111 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని లేదా మై ఎయిర్టెల్ మొబైల్ యాప్‌లో చూసుకోవాలని పేర్కొంది. 24 గంటల్లో 30జీబీ ఉచిత డేటాను కస్టమర్లకు క్లయిమ్ చేస్తామని ఎయిర్టెల్ తెలిపింది. మరింత సమాచారం కోసం ఎయిర్టెల్ కస్టమర్లు airtel.in/4gupgrade వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని చెప్పింది. 4జీ స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నాయని, లక్షల కొద్దీ ఫీచర్ ఫోన్, 3జీ డివైజ్‌లు, 4జీ స్మార్ట్‌ఫోన్‌లోకి అప్‌గ్రేడ్ కావాలనుకోవడం అతిపెద్ద నిర్ణయమని భారతీ ఎయిర్టెల్ సీఎంఓ వేణి వెంకటేశ్ తెలిపారు. ఇదే కస్టమర్‌కు చెందిన అతిపెద్ద రివార్డింగ్ ప్రొగ్రామ్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో 4జీ స్పీడ్‌లో ఆన్లైన్ ప్రపంచాన్ని అనుభవించే అవకాశం తమ కస్టమర్లకు దొరుకుతుందన్నారు. ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్’ కార్యక్రమం కింద ఇప్పటికే ఎయిర్టెల్, పలు మొబైల్ హ్యాండ్సెట్ తయారీదారులతో భాగస్వామ్యం ఏర్పరుచుకుని, అత్యంత తక్కువ ధరల్లో 4జీ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెడుతోంది. -
జియోకు మరో షాక్: ఎయిర్టెల్ 50జీబీ డేటా
టెలికాం దిగ్గజం ఎయిర్టెల్, రియలన్స్ జియోతో వార్ కొనసాగిస్తూనే ఉంది. రోజుకో కొత్త ప్రకటనతో జియోకు కౌంటర్ ఇస్తోంది. నిన్ననే తొలిసారి 4జీ యూజర్ల కోసం రూ.1,399తో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన ఎయిర్టెల్, తాజాగా మరో కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. తన పోస్టుపెయిడ్ యూజర్ల కోసం కొత్త మైప్లాన్ ఇన్ఫినిటీ పోస్టు పెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద 50జీబీ డేటా, అపరిమిత కాల్స్‌ను ఎయిర్టెల్ ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. రోమింగ్ ఇన్కమింగ్ కాల్స్, రోమింగ్ అవుట్గోయింగ్ కాల్స్ కూడా ఈ ప్లాన్ కింద అపరమితమే. ప్రస్తుతం తీసుకొచ్చిన ఈ ప్లాన్ కొత్త, పాత యూజర్లందరికీ అందుబాటులో ఉంటుందని, వాడుకోని డేటాను వచ్చే బిల్లింగ్ సైకిల్‌కు పంపించుకునే వెసులుబాటు కూడా ఉందని పేర్కొంది. గత నెల సెప్టెంబర్‌లో ప్రీపెయిడ్ యూజర్ల కోసం కూడా కంపెనీ రూ.999 ప్యాక్‌ను లాంచ్ చేసింది. ఆ రీఛార్జ్ కింద రోజుకు 4జీబీ డేటా చొప్పున 112జీబీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. అయితే ప్రస్తుతం పోస్టుపెయిడ్ యూజర్లకు తీసుకొచ్చిన ఈ ప్లాన్‌లో ఎలాంటి రోజువారీ పరిమితులు లేవు. ఒక్కసారి 50జీబీ డేటా అయిపోతే, ఒక్కో ఎంబీకి 50 పైసా ఛార్జ్ పడుతోంది. జియో కూడా తన రూ.999 పోస్టు పెయిడ్ ప్లాన్ కింద 90జీబీ డేటాను ఎలాంటి పరిమితులు లేకుండా అందిస్తోంది. జియో ప్లాన్ వాలిడిటి 2 నెలలు. -
ఎయిర్టెల్ బంపర్ ఆఫర్: 30జీబీ డేటా ఫ్రీ
సాక్షి, న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. తన కొత్త పోస్టుపెయిడ్ కస్టమర్లకు ''బోనస్ 30జీబీ'' ఆఫర్‌ను సోమవారం ప్రకటించింది. మూడు నెలల కాలాల పాటు నెలకు 10జీబీ ఉచిత డేటా చొప్పున 30జీబీ ఉచిత డేటాను పోస్టుపెయిడ్ యూజర్లకు అందించనున్నట్టు కంపెనీ చెప్పింది. ఈ కొత్త ఆఫర్ కింద ఉచితంగా సిమ్‌ను కస్టమర్ల ఇంటి వద్దకే డెలివరీ చేయనున్నట్టు కూడా చెప్పింది. కంపెనీకి చెందిన అన్ని అపరిమిత సిరీస్ పోస్టు పెయిడ్ ప్లాన్లకు ఈ కొత్త ఎయిర్టెల్ 30జీబీ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తన వెబ్సైట్లో తెలిపింది. రూ.499, రూ.649, రూ.799, రూ.1,199 ప్లాన్ల అన్నింటికీ బోనస్ 30జీబీ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద ఈ నెలలో వాడుకోని డేటాను వచ్చే నెలకు బదిలీ చేసుకునే అవకాశం కూడా యూజర్లకు ఉంది. ఈ నెల మొదట్లో కూడా ఎయిర్టెల్ తన పోస్టుపెయిడ్ కస్టమర్లకు 60జీబీ వరకు ఉచిత ఇంటర్నెట్ డేటాను అందించనున్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. కంపెనీకి చెందిన ఎయిర్టెల్ టీవీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న కస్టమర్లకు ఈ ఉచిత డేటా అందించనున్నట్టు చెప్పింది. అంటే నెలకు 10జీబీ చొప్పున ఆరు నెలల పాటు ఆఫర్ చేయనుంది. ''బోనస్ 30జీబీ'' ఉచిత డేటాను పొందాలంటే, ఎయిర్టెల్ పోస్టు పెయిడ్ యూజర్లు మైఎయిర్‌టెల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఆఫర్ అచ్చం మాన్సూన్ ఆఫర్ మాదిరిదైనా లేదా అనేది కంపెనీ తెలుపలేదు. ఎయిర్టెల్ తన మాన్సూన్ ఆఫర్ కింద ఎయిర్టెల్, తన పోస్టు పెయిడ్ కస్టమర్లకు నెలకు 10జీబీ ఉచిత డేటా చొప్పున, మూడు నెలల పాటు అందిస్తోంది. -
ఎయిర్టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్
రిలయన్స్ జియోకు గట్టిపోటీని ఇచ్చేందుకు టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తన కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. పోస్టుపెయిడ్ కస్టమర్లు ఒకవేళ నెలలో వాడుకోవాల్సిన డేటాను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతే దాన్ని వచ్చే బిల్లింగ్ సైకిల్లో వాడుకునేలా అవకాశం కల్పించింది. అంటే డేటా క్యారీ ఫార్వర్డ్ ద్వారా దీన్ని వచ్చే బిల్లింగ్ సైకిల్‌కు మార్చుకోవచ్చు. దీంతో డేటా సమయం అయిపోతుందనే బెంగ యూజర్లకు ఉండదు. ఆగస్టు 1 నుంచి ఈ డేటా క్యారీ ఫార్వర్డ్ సేవలను కంపెనీ ప్రారంభించనున్నట్టు ఎయిర్టెల్ చెప్పింది. మైఎయిర్‌టెల్ యాప్ ద్వారా డేటాను ట్రాక్ చేసుకుని, వచ్చే బిల్లింగ్ సైకిల్‌కు ఫార్వర్డ్ చేసుకోవచ్చు. కస్టమర్లు తమ అకౌంట్‌పైన పలు పోస్టుపోయిడ్ కనెక్షన్లను తీసుకుని కూడా 20 శాతం వరకు ఖర్చును ఆదా చేసుకోవచ్చు. ఇలా అన్ని కనెక్షన్లకు డేటా ప్రయోజనాలను షేర్ చేసుకోవచ్చని ఎయిర్టెల్ తెలిపింది. అంతేకాక రూ.2000 కోట్ల ప్లాన్‌ను ప్రకటించింది. కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరుచుకోవడం కోసం వివిధ డిజిటల్ ఆఫర్లను లాంచ్ చేయనున్నామని, వాటికోసం మూడేళ్లలో 2వేల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెడుతున్నట్టు పేర్కొంది. అదేవిధంగా ఈ ఏడాది చివరికల్లా దేశమంతటా వాయిస్ ఓవర్ ఎల్టీసీ సర్వీసులను లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. వాయిస్ఓవర్ ఎల్టీఈ సర్వీసుల ట్రయల్స్ 5 సిటీల్లో నడుస్తున్నాయని, ఏడాది చివరికల్లా దేశమంతా ఈ సర్వీసులను తీసుకొస్తామని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్ చెప్పారు. రిలయన్స్ జియో మార్కెట్లోకి ప్రవేశించిన దగ్గర్నుంచి ఈ కంపెనీకి తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. తన కస్టమర్లను కాపాడుకోవడానికి ఎయిర్టెల్ పలు ఆఫర్లను సైతం ప్రవేశపెడుతోంది. జియో దెబ్బకు ఈ కంపెనీకి నష్టాలు సైతం వాటిల్లుతున్నాయి. కానీ జియోకు గట్టికి బదులు ఇచ్చేందుకు ఎయిర్టెల్ సిద్ధమైంది. ప్రాజెక్ట్ నెక్ట్స్‌లో భాగంగా ఎయిర్టెల్ తన ఇన్-స్టోర్ అనుభవాన్ని మెరుగుపరుచుకోనుంది. దేశమంతటా ఉన్న 2500కి పైగా స్టోర్లను రీడిజైన్ చేయనుంది. అంతేకాక ప్లాన్లను మార్చుకోవడానికి కస్టమర్లకు మైఎయిర్టెల్యాప్ కొత్తవెర్షన్‌ను ఆవిష్కరించింది. -
ఎయిర్టెల్ కొత్త ప్లాన్స్... ఏంటవి?
జియో ఎంట్రీతో మొదలైన టెలికాం ఇండస్ట్రీలో బ్రాడు బ్యాండ్ స్పీడు, డేటా, కాలింగ్ ప్లాన్స్ లో వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ మరోసారి తన పోస్టు పెయిడ్ కస్టమర్ల ప్లాన్స్ ను సవరించింది. ప్రస్తుతం సవరించిన ప్లాన్స్ మైప్లాన్ ఇన్ఫీనిటీ కింద దేశవ్యాప్తంగా ఇన్ కమింగ్ కాల్స్ కు ఉచిత రోమింగ్ ప్రయోజనాలను అందించనుంది. రూ.299 ప్లాన్... అన్ని కనెక్షన్లకు 680 నిమిషాల లోకల్, ఎస్టీడీ కాల్స్ తో పాటు, 600 ఎంబీ 4జీ డేటాను కంపెనీ ఈ బిల్లింగ్ సైకిల్ లో ఆఫర్ చేయనుంది. రూ.399 ప్లాన్... ఉచిత లోకల్, ఎస్టీడీ కాల్స్ నిమిషాలను కంపెనీ 765కు పెంచింది. డేటా వాడకం కూడా ఈ బిల్లింగ్ సైకిల్ లో 1జీబీకి పెంచింది. ఈ రెండు ప్యాక్ ఆఫర్స్ కింద కంపెనీ ఉచిత రోమింగ్ ఇన్కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని అందించనుంది. అవుట్ గోయింగ్ లోకల్ కాల్స్ కు నిమిషానికి 80 పైసలను వసూలు చేయనుంది. అదే అవుట్ గోయింగ్ ఎస్టీడీ కాల్స్ కైతే, నిమిషానికి 1.15పైసల ఛార్జీ వేయనుంది. స్పీడ్ టెస్ట్ సర్వీసుల తనకు ఫాస్టెస్ట్ నెట్ వర్క్ అనే టైటిల్ ఇచ్చిన సందర్భంగా కంపెనీ తన పోస్టు పెయిడ్ కస్టమర్లకు 6జీబీ నుంచి 30జీబీ డేటా ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. మై ఎయిర్ టెల్ యాప్ ద్వారా ఏప్రిల్ 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ కొత్త ప్లాన్స్ లో కంపెనీ అపరిమిత ప్రయోజనాలను కల్పించడం లేదు. 499 ప్లాన్ కిందనైతే, కంపెనీ అపరిమిత ఎస్టీడీ, లోకల్ కాల్స్, 3జీబీ 4జీ డేటాను వంటివాటిని పొందవచ్చు. -
ఇక ఐడియా రోమింగ్ ఫ్రీ
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి.. న్యూఢిల్లీ: స్వదేశంలో రోమింగ్ చార్జీలను ఎత్తివేస్తూ ఐడియా సెల్యులర్ భారతీ ఎయిర్టెల్ బాటలో నడిచింది. ఏప్రిల్ 1 నుంచి తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు దేశీయంగా రోమింగ్‌లో ఇన్కమింగ్ కాల్స్‌ను ఉచితంగా అందుకోవచ్చని ప్రకటించింది. అంతర్జాతీయ రోమింగ్‌కు సంబంధించి వేల్యూ ప్యాక్‌లను ఈ సందర్భంగా ప్రవేశపెట్టింది. దేశీయ రోమింగ్‌లో కాల్స్, ఎస్ఎంఎస్లపై చార్జీలను ఎత్తివేస్తూ భారతీ ఎయిర్టెల్ ప్రకటించిన నేపథ్యంలో పోటీగా ఐడియా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రోమింగ్‌లో అవుట్గోయింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లను సైతం తక్కువ చార్జీలకే అందిస్తున్నట్టు ఐడియా ప్రకటించింది. సొంత సర్కిల్లో అందుబాటులో ఉన్న డేటా ప్యాక్‌లను అదనపు చార్జీలు లేకుండా రోమింగ్‌లోనూ వాడుకోవచ్చని స్పష్టం చేసింది. అంతర్జాతీయ పర్యాటకులకు రోమింగ్ కోసం రూ.2,499, రూ.5,999 ప్యాక్‌లను ప్రకటించింది. 400 అవుట్గోయింగ్ నిమిషాలు, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, 3జీబీ బండిల్డ్ డేటా, ఉచిత అపరిమిత కాల్స్ వీటిపై అందుకోవచ్చు. కాల వ్యవధి 30 రోజులు. 10 రోజుల వ్యాలిడిటీతో రూ.1,199 ప్యాక్ కూడా ఉంది. -
ఐడియా ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్స్
న్యూఢిల్లీ: ఐడియా సెల్యులర్ కంపెనీ ఆకర్షణీయమైన రెండు ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌లను ఆఫర్ చేస్తోంది. పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ఈ రోమింగ్ ప్యాక్‌లు వర్తిస్తాయని కంపెనీ మంగళవారం తెలిపింది. డేటా చార్జీలు 90 శాతం, వాయిస్ టారిఫ్‌ల్లో 80 శాతం డిస్కౌంట్‌తో ఈ రోమింగ్ ప్యాక్‌లను అందిస్తున్నామని ఐడియా సెల్యులర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ తెలిపారు. రూ. 599 ప్యాక్ వ్యాలిడిటీ 10 రోజులని, రూ.1,499 ప్యాక్ వ్యాలిడిటీ 30 రోజులని పేర్కొన్నారు. అమెరికా, సింగపూర్, ఇంగ్లండ్, థాయ్‌లాండ్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ తదితర 40 దేశాలకు ఈ రోమింగ్ ప్యాక్‌లు వర్తిస్తాయని వివరించారు. ఈ రెండు ప్యాక్‌ల్లో లోకల్, ఇంటర్నేషనల్ అవుట్ గోయింగ్ కాల్స్‌కు నిమిషానికి రూ.15, ఇన్కమింగ్ కాల్స్‌కు నిమిషానికి రూ.30 చొప్పున టారిఫ్ ఉంటుందని తెలిపారు. డేటా చార్జీల విషయానికొస్తే 1 ఎంబీకి రూ.30 చార్జ్ అవుతుందని వివరించారు. రూ.1,499 ప్యాక్‌లో ఇంటర్నేషనల్ రోమింగ్‌లో ఉన్నప్పుడు 30 నిమిషాల ఇన్కమింగ్ కాల్స్ ఉచితమని పేర్కొన్నారు. ఇంతకు ముందు ఇంటర్నేషనల్ కాల్ రేట్లు నిమిషానికి రూ.145 నుంచి రూ.185 గానూ, డేటా చార్జీలు 1 ఎంబీకి రూ.512 గానూ కంపెనీ చార్జ్ చేసేది.