ఇక ఐడియా రోమింగ్‌ ఫ్రీ | Idea Cellular offers free roaming within India, special packs for international travelers | Sakshi
Sakshi News home page

ఇక ఐడియా రోమింగ్‌ ఫ్రీ

Published Mon, Mar 13 2017 4:40 AM | Last Updated on Thu, Aug 30 2018 6:01 PM

ఇక ఐడియా రోమింగ్‌ ఫ్రీ - Sakshi

ఇక ఐడియా రోమింగ్‌ ఫ్రీ

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి..
న్యూఢిల్లీ: స్వదేశంలో రోమింగ్‌ చార్జీలను ఎత్తివేస్తూ ఐడియా సెల్యులర్‌ భారతీ ఎయిర్‌టెల్‌ బాటలో నడిచింది. ఏప్రిల్‌ 1 నుంచి తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లు దేశీయంగా రోమింగ్‌లో ఇన్‌కమింగ్‌ కాల్స్‌ను ఉచితంగా అందుకోవచ్చని ప్రకటించింది. అంతర్జాతీయ రోమింగ్‌కు సంబంధించి వేల్యూ ప్యాక్‌లను ఈ సందర్భంగా ప్రవేశపెట్టింది. దేశీయ రోమింగ్‌లో కాల్స్, ఎస్‌ఎంఎస్‌లపై చార్జీలను ఎత్తివేస్తూ భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించిన నేపథ్యంలో పోటీగా ఐడియా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

 రోమింగ్‌లో అవుట్‌గోయింగ్‌ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను సైతం తక్కువ చార్జీలకే అందిస్తున్నట్టు ఐడియా ప్రకటించింది. సొంత సర్కిల్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్యాక్‌లను అదనపు చార్జీలు లేకుండా రోమింగ్‌లోనూ వాడుకోవచ్చని స్పష్టం చేసింది. అంతర్జాతీయ పర్యాటకులకు రోమింగ్‌ కోసం రూ.2,499, రూ.5,999 ప్యాక్‌లను ప్రకటించింది. 400 అవుట్‌గోయింగ్‌ నిమిషాలు, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 3జీబీ బండిల్డ్‌ డేటా, ఉచిత అపరిమిత కాల్స్‌ వీటిపై అందుకోవచ్చు. కాల వ్యవధి 30 రోజులు. 10 రోజుల వ్యాలిడిటీతో రూ.1,199 ప్యాక్‌ కూడా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement