Chief Marketing Officer
-
ఏబీసీ చైర్మన్‌గా దేబబ్రత ముఖర్జీ
న్యూఢిల్లీ: 2021–2022 ఏడాదికిగాను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్యులేషన్స్(ఏబీసీ) చైర్మన్‌గా దేబబ్రత ముఖర్జీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్‌కు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జనరల్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, సేల్స్ ఆపరేషన్స్, బిజినెస్ స్ట్రాటజీ, ఇన్నోవేషన్ ఇలా పలు విభాగాల్లో ఆయనకు 27 ఏళ్లకుపైగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఏబీసీ కౌన్సిల్ పబ్లిషర్ సభ్యులైన ప్రతాప్ జి. పవార్.. ఏబీసీ డెప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అడ్వటైజర్స్ రిప్రజెంటేటివ్స్‌గా ఐటీసీ సంస్థ తరఫున కరుణేశ్ బజాజ్, టీవీఎస్ మోటార్ కంపనీ తరఫున అనిరుద్ధ హల్దార్, మారుతి సుజుకీ ఇండియా తరఫున శశాంక్ శ్రీవాస్తవ ఉన్నారు. చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ పబ్లిషర్స్ రిప్రజెంటేటివ్స్‌గా సకల్ పేపర్స్ సంస్థ తరఫున ప్రతాప్ పవార్, మలయాళ మనోరమ తరఫున రిషద్ మాథ్యూ, లోక్మత్ మీడియా తరఫున దేవేంద్ర వి. దర్దా, ది బాంబే సమాచార్ తరఫున హర్ముస్జీ ఎన్. కామా, జాగరణ్ ప్రకాశన్ తరఫున శైలేశ్ గుప్తా, హెచ్‌టీ మీడియా తరఫున ప్రవీణ్ సోమేశ్వర్, బెన్నెట్,కోల్మన్ అండ్ కో తరఫున మోహిత్ జైన్, ఏబీపీ తరఫున ధ్రువ ముఖర్జీ ఉన్నారు. అడ్వటైజింగ్ ఏజెన్సీల రిప్రజెంటేటివ్స్‌గా మ్యాడిసన్ కమ్యూనికేషన్స్ తరఫున విక్రమ్ సఖూజా, ఐపీజీ మీడియాబ్రాండ్స్ తరఫున శశిధర్ సిన్హా, ఆర్కే స్వామి బీబీడీవో తరఫున శ్రీనివాసన్ కె. స్వామి, డెంట్సు ఏగిస్ నెట్వర్క్ కమ్యూనికేషన్స్ ఇండియా సంస్థ తరఫున ఆశిశ్ భాసిన్ ఉన్నారు. సెక్రటరీ జనరల్‌గా హార్ముజ్ మాసాని కొనసాగనున్నారు. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన -
ఐడియా బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ : ఇంటర్నెట్ వాడకానికి దూరంగా ఉంటున్న యూజర్లను ఆకట్టుకోవడానికి ఐడియా సెల్యులార్ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. "ఇంటర్నెట్ ఫర్ ఆల్" అనే ఆవిష్కరణతో ఇంటర్నెట్ వాడని యూజర్ల ముందుకు వచ్చింది. ఐడియా ప్రీపైడ్ కస్టమర్లు, రిటైలర్లకు నెలకు 100 ఎంబీ డేటా ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది. *756# కు డయల్ లేదా ఐఎఫ్ఏ అని 56756కు మెసేజ్ పంపినా ఈ సర్వీసు కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, షాపింగ్, ఎంటర్ టైన్ మెంట్, ఇతర యాక్సస్ లకు ఓ టూల్ లా వాడుతున్న ఇంటర్నెట్ గురించి యూజర్లు తెలుసుకునేలా ప్రోత్సహించడంలో ఈ ఆవిష్కరణ ఎంతో ఉపకరిస్తుందని ఐడియా సెల్యులార్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో ఇంటర్నెట్ సేవలు వినియోగం పెంచడానికి ఇది దోహదంచేస్తుందని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఇంటర్నెట్ లో కనెక్టు కాని స్నేహితుల, కుటుంబసభ్యులకు, ఇంటర్నెట్ యూజర్లు ఈ సర్వీసులను పరిచయం చేస్తారని వెల్లడించారు. దీంతో వారి జీవితాలను కొత్తపథంలో నడుస్తాయన్నారు. ఇంటర్నెట్ వరల్డ్ గూటికిందకు తన కస్టమర్లలందరినీ చేర్చాలనే ఉద్దేశంతో ఈ సేవలను ప్రారంభించినట్టు తెలిపారు. నాన్ ఇంటర్నెట్ యూజర్లు ఎలా ఈ ఉచిత డేటా సర్వీసులను అందిపుచ్చుకోవాలో పిరియాడిక్ గా యూజర్లకు సమాచారం పంపుతుంటామని ఐడియా చెప్పింది. -
టాటా ఏఐఏ నుంచి కొత్త బీమా ప్లాన్
ఇటు టర్మ్, అటు ఎండోమెంట్ ప్లాన్ల కలయికతో టాటా ఏఐఏ లైఫ్ కొత్తగా సెక్యూర్ 7 పేరిట బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఒకవైపు బీమా రక్షణ కల్పిస్తూనే మరోవైపు గ్యారంటీ రాబడులు కూడా అందించేలా దీన్ని తీర్చిదిద్దినట్లు కంపెనీ తెలిపింది. పాలసీ వ్యవధి 14 ఏళ్లు కాగా ప్రీమియం చెల్లింపు వ్యవధి ఏడేళ్లు ఉంటుందని పేర్కొంది. ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసిన తర్వాత ఏడేళ్ల పాటు హామీపూర్వక వార్షిక రాబడులు ఇది అందిస్తుంది. మెచ్యూరిటీ తర్వాత బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 25 శాతం మొత్తాన్ని పాలసీదారుకు కంపెనీ చెల్లిస్తుంది.