ఐడియా.. మరో 3జీ ఫోన్ | Idea launches !d 4000 3G smartphone | Sakshi
Sakshi News home page

ఐడియా.. మరో 3జీ ఫోన్

Published Fri, Jun 20 2014 12:48 AM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM

ఐడియా.. మరో 3జీ ఫోన్ - Sakshi

ఐడియా.. మరో 3జీ ఫోన్

హైదరాబాద్:  ఐడియా సెల్యులర్ కంపెనీ మరో కొత్త 3జీ స్మార్ట్‌ఫోన్... ఐడీ 4000ను గురువారం ఆవిష్కరించింది. ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ ధర రూ.4,999 అని ఐడియా సెల్యులర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 4 అంగుళాల డిస్‌ప్లే, 3.2 మెగా పిక్సెల్ కెమెరా, 1 గిగా హెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, మైక్రో ఎస్‌డీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 21.1 ఎంబీపీఎస్ 3జీ స్పీడ్  వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు.

డేటా ఆఫర్లతో ఈ ఫోన్‌ను అంది స్తామని ఆయన వివరించారు. ప్రస్తుత 3జీ వినియోగదారులకు రూ.259 ప్యాకేజీలో 1.6 జీబీ డేటాను, మూడు నెలలు ఐడియా టీవీ ఉచితమని పేర్కొన్నారు. కొత్త వినియోగదారులకు ఈ డేటా ప్యాకేజీని రూ.261కు అందిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
 
17వ ఫోన్...: ఐడియా సెల్యులర్ అందిస్తున్న 17వ 3జీ స్మార్ట్‌ఫోన్ ఇదని శశి శంకర్ తెలిపారు. ఇప్పటిదాకా 7 లక్షల 3జీ ఫోన్లను విక్రయించామని పేర్కొన్నారు. మొత్తం 11 టెలికం సర్కిళ్లు-ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కేరళ, మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, తూర్పు, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ల్లో ఈ ఫోన్‌ను విక్రయించనున్నామని శశి శంకర్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement