రేపు తెలుగు నాటక రంగ దినోత్సవం
Published Fri, Apr 14 2017 11:17 PM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM
కాకినాడ కల్చరల్ :
స్థానిక దంటు కళాక్షేత్రంలో ది యంగ్మె¯Œ్స హ్యాపీ క్లబ్ ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఆదివారం సాయంత్రం తెలుగు నాటక రంగ దినోత్సవ సభ నిర్వహించనున్నట్టు క్లబ్ నిర్వాహకులు తెలిపారు. ఈ సభలో ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత, ప్రయోక్త, గాయకుడు కెర్ల వెంకటేశ్వరరావు(విశాఖపట్టణం)కు క్లబ్ వ్యవస్థాపకుడు స్వర్గీయ దంటు సూర్యారావు స్మారక జీవితకాల నట పురస్కారం ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ హాజరవుతారని తెలిపారు.
Advertisement
Advertisement