ఈ రోజు ప్రత్యేకతేంటో తెలుసా? | 21st Day Of 2021 Year Of 21st Century | Sakshi
Sakshi News home page

ఈ రోజు ప్రత్యేకతేంటో తెలుసా?

Published Thu, Jan 21 2021 1:20 PM | Last Updated on Thu, Jan 21 2021 3:52 PM

21st Day Of 2021 Year Of 21st Century - Sakshi

2021 సంవత్సరంలో ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే!.. 21వ శతాబ్ధంలో.. 21వ సంవత్సరంలో వచ్చిన 21వ రోజు ఇది. 1846లో ఇదే రోజున చార్లెస్‌ డికెన్స్‌ ‘డైలీ న్యూస్‌’ మొదటి ఎడిషన్‌ విడుదలైంది. 1950లో ప్రముఖ నవల ‘ అనిమల్‌ ఫార్మ్‌’ రచయిత జార్జ్‌ ఆర్వెల్‌ మరణించారు. 
వీటితో పాటు.. 
► నేషనల్‌ హగ్గింగ్‌ డే
► నేషనల్‌ హగ్‌ యువర్‌ పప్పీ డే
► ఉమెన్స్‌ హెల్దీ వేయిట్‌ డే కూడా ఈ రోజే.
అంతేకాకుండా.. ఈ సంవత్సరానికి కూడా ఓ ప్రత్యేక ఉంది. శుక్రవారంతో మొదలై.. శుక్రవారంతో ముగిసే లీపు సంవత్సరం ఇది. 2010 సంవత్సరాన్ని పోలిన ఈ సంవత్సరం క్యాలెండర్‌ 2027, 2100లో మాత్రమే మళ్లీ పునరావృతమవుతుంది.

ఈ రోజు ప్రత్యేకతను అందరికీ తెలియజేస్తూ కొందరు నెటిజన్లు ట్వీట్లు చేసేస్తున్నారు. ‘‘ మన జీవితంలో ఈ రోజు చాలా ప్రత్యేకమైనది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఓ అడుగు ముందుకు వేసి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement