సూర్యుడు ఒక నిర్దిష్ట బిందువుకి చేరుకున్నప్పుడూ నీడలు అదృశ్యమవుతాయి. ఈ అరుదైన ఘటన సంవత్సరానికి ఒకసారి కనువిందు జరుగుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో రెండు సార్లు సంభవిస్తుంది. సరిగ్గా సూర్యుడు భూమధ్య రేఖ పైన ఉన్నప్పుడూ సూర్యకిరణాలు భూమి ఉపరితలంపై లంబంగా పడతాయి. దీంతో పగటిపూట కొద్దిసేపు నీడలు కనిపించవు. దీన్ని ప్రపంచంలోని కొన్ని ఉష్ణమండల ప్రాంతాల్లో గమనించవచ్చు.
ఈ మేరకు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మంగళవారం కోరమంగళ క్యాంపస్‌లో ఈ అరుదైన దృగ్విషయానికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సరిగ్గా మధ్యాహ్నం 12.17 గంటలకు సూరుడు నడినెత్తిపై ఉండగా ఇది జరగుతుందని, లంబంగా పడే కిరణాలు ఎటువంటి నీడను ఉత్పత్తి చేయవని బెంగళూరు అమెచ్యూర్ ఖగోళ శాస్త్రవేత్తల సంఘం ట్వీట్‌లో తెలిపింది. జీరో షాడో అనేది.. భూమి అక్ష సంబంధ వంపు ఫలితంగా ఇలాంటి అరుదైన ఘటన సంభవిస్తుందని స్పష్టం చేసింది.
సూర్యుని స్థానం ఏడాది పోడవునా మారుతుందని. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడూ అక్ష సంబంధం మారినప్పుడల్లా.. సూర్యని స్థానం మారి వేరు వేరు నీడలు ఏర్పడతాయని పేర్కొంది. అందువల్లే ఏడాది పొడవున వేర్వేరు నీడలు ఏర్పడతాయని తెలిపింది. సూర్యకిరణాలు వసంత రుతువు నుంచి శరదృతువు మధ్య సమయంలో భూమధ్యరేఖ వెంబడి 90 డిగ్రీల కోణంలో సూర్యకిరణాలు భూమిని తాకుతాయని ఫలితంగా నీడలు ఉండవని వివరించింది బెంగళూరు ఆస్ట్రోఫిజిక్స్ ఇన్‌స్టిట్యూట్. ఈ జీరో డేకి గుర్తుగా ఆస్టోఫిజిక్స్ ఇన్‌స్టిట్యూట్ మంగళవారం కోర మంగళ క్యాంపస్‌లో ఈ ఖగోళ అద్భుతాన్నిప్రజలు తెలియజేసేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
(చదవండి: ఓ తల్లి కిరాత చర్య..ప్రెగ్నెంట్ అని తెలియక పసికందుని..)
Comments
Please login to add a commentAdd a comment