అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతియేటా జూన్ 21న నిర్వహిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె)లోని భారత హైకమిషన్ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి మాట్లాడుతూ ఈ ఏడాది మహిళా సాధికారత థీమ్‌తో యోగా డేను నిర్వహించనున్నామని తెలిపారు. గత ఏడాది జరిగిన యోగా కార్యక్రమంలో 700 మందికి పైగా జనం పాల్గొన్నారని, వివిధ సంఘాల సభ్యులు కూడా హాజరయ్యారన్నారు. అదేవిధంగా ఈసారి కూడా అధిక సంఖ్యలో జనం యోగా కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు.
యోగా అన్ని వర్గాల వారినీ కలుపుతుందని, అందరికీ ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ తెలిపారన్నారు. ఈ ఏడాది జరిగే యోగా కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొననున్నారన్నారు. బ్రిటిష్ పౌరుడు ఇందర్‌పాల్ ఓహ్రీ చందేల్ మాట్లాడుతూ యోగా అనేది మన వారసత్వంలో భాగమని, దానితో మనం కనెక్ట్ కావడం అందరికీ ముఖ్యమన్నారు. ఈ ఏడాది జరిగే యోగా దినోత్సవంలో భారత బధిర క్రికెట్ జట్టు సభ్యులు పాల్గొనబోతున్నారని అన్నారు. 2015 నుండి ప్రతీయేటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment