ప్రేమ, వినోదం జతకడితే... | Sri, Haripriya New Movie Launched | Sakshi
Sakshi News home page

ప్రేమ, వినోదం జతకడితే...

Published Thu, Sep 12 2013 12:59 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM

ప్రేమ, వినోదం జతకడితే...

ప్రేమ, వినోదం జతకడితే...

శ్రీ, హరిప్రియ జంటగా క్రియేటివ్ పిక్సల్స్ పతాకంపై రాజేంద్రప్రసాద్ వర్మ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి కె.అచ్చిరెడ్డి క్లాప్ ఇవ్వగా, ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. 
 
 ప్రేమ నేపథ్యంలో రూపొందుతోన్న పూర్తి వినోదాత్మక చిత్రమిదని దర్శకుడు చెప్పారు. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, హైదరాబాద్, వైజాగ్‌ల్లో తొలి షెడ్యూల్ పూర్తి చేస్తామని నిర్మాత తెలిపారు. అలీ కీలక పాత్ర పోషిస్తున్న  ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: ఫిరోజ్‌ఖాన్, పాటలు: కృష్ణచైతన్య.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement