Galata
-
మద్యం మత్తులో గలాటా .. ఒకరి మృతి
తాడేపల్లిగూడెం రూరల్ : మద్యం మత్తులో జరిగిన గలాటా ఒకరి మృతికి కారణమైంది. పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక పోస్టాఫీసు రోడ్డులోని ఊర్వశి వైన్స్ వద్ద బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో టాక్సీ డ్రైవర్లు సత్తిబాబు, కృపారావు కలిసి రామిశెట్టి శ్రీనివాస్‌తో గొడవ పడ్డారు. గొడవ పెద్దది కావడంతో వారిద్దరూ కలిసి శ్రీనివాస్‌పై దాడి చేశారు. దీంతో శ్రీనివాస్(31) మృతి చెందాడు. మృతుడు పడాల గ్రామ వాసి. రైల్వే స్టేషన్ రోడ్డులోని ఒక స్వీట్స్ కార్ఖానాలో కూలీగా పనిచేస్తున్నాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు (18నెలలు) ఉన్నారు. దీంతో సీఐ ఎం.ఆర్.ఎల్.ఎస్.ఎస్.మూర్తి హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తియ్యని తలపుల ప్రణయం!
ప్రేమలోకంలో విహరిస్తుంటుంది ఆ జంట. తియ్యని కబుర్లు చెప్పుకోవడంతో పాటు చిరుకోపాలు, అడపా దడపా అలకలతో వారి ప్రేమ ప్రయాణం హాయిగా సాగిపోతుంటుంది. అలాంటి వారి జీవితాలు ఎటువంటి మలుపు తీసుకున్నాయి? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘గలాటా’.ఈ సినిమా ఆసాంతం వినోద ప్రధానంగా సాగుతుందని చిత్రదర్శకుడు కృష్ణ చెప్పారు. శ్రీ, హరిప్రియ జంటగా రాజేంద్రప్రసాద్ వర్మ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఓ అల్లరి జంట ప్రేమకథ ఇది. ప్రేమలోని కొత్త కోణాన్ని ఇందులో ఆవిష్కరించాం. సునీల్ కశ్యప్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రం ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీతేజ నడింపల్లి. -
నేను లవ్ గురూని..!
‘‘ఇందులో నేను లవ్‌గురుగా కనిపిస్తాను. చిలిపి సరదాల దృశ్యరూపంగా అనిపించే అల్లరి ప్రేమికుల కథ ఇది’’ అని శ్రీ అన్నారు. కృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీ, హరిప్రియ జంటగా డి.రాజేంద్రప్రసాద్‌వర్మ నిర్మించిన చిత్రం ‘గలాట’. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీ విలేకరులతో ముచ్చటించారు. ‘కొత్త దర్శకులతో ఇక చేయకూడదు అనుకున్నాను. కానీ... అద్భుతమైన కథ చెప్పి నన్ను ఒప్పించాడు దర్శకుడు కృష్ణ. ఎంత బాగా చెప్పాడో, అంతకు తగ్గ బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చాడు. బామ్మకు నచ్చే లక్షణాలున్న అమ్మాయిని వెతుక్కుంటూ ముంబయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ కుర్రాడికి వెతకబోయే తీగ కాలికి తగిలినట్లు తనకు కావాల్సిన లక్షణాలన్నీ ఉన్న ఓ అమ్మాయి గుళ్లో పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఓ మంత్రి వల్ల సమస్యల్లో పడిన ఆ అమ్మాయిని హీరో ఎలా కాపాడి, తనదాన్ని చేసుకున్నాడు? అనేది ఈ సినిమా కథాంశం. కుటుంబ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి వల్గారిటీ లేకుండా దర్శకుడు ఈ సినిమాను మలిచాడు. జంధ్యాలగారి సినిమా చూస్తున్న ఫీల్ కలిగిస్తుందీ సినిమా’’ అని చెప్పారు. సునీల్ కశ్యప్ శ్రావ్యమైన బాణీలిచ్చారని, కృష్ణ నటించిన ‘గూఢచారి 116’లోని ‘నువ్వునా ముందుంటే..’ పాటను ఏ మాత్రం మార్చకుండా యథాతథంగా పెట్టామని శ్రీ తెలిపారు. ‘ఈ రోజుల్లో, బస్టాప్’ చిత్రాలకు పనిచేసిన కిరణ్ దర్శకత్వంలో ‘సాహసం సేయరా డింభకా’ చిత్రం చేయనున్నట్లు ఆయన చెప్పారు. -
చిట్టి ప్రేమకథ ఏంటి?
బామ్మ పోరు పడలేక తనకు నచ్చిన తెలుగమ్మాయిని వెతుక్కుంటూ ముంబయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన చిట్టి అనే కుర్రాడికి ఆండాళ్ అనే అమ్మాయి తారపడుతుంది. తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘గలాటా’. శ్రీ, హరిప్రియ జంటగా నటించారు. కృష్ణ దర్శకుడు. డి.రాజేంద్రప్రసాద్‌వర్మ నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ప్రేమకథల్లో ఇదొక కొత్తకోణం. పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా ఇది. ఇటీవల విడుదలైన సునీల్ కశ్యప్ సంగీతానికి మంచి స్పందన వస్తోంది. యువతరం మెచ్చే కథాంశంతో జనరంజకంగా కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని తెలిపారు. సాయికుమార్, అలీ, నాగబాబు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ఫిరోజ్‌ఖాన్, పాటలు: కృష్ణచైతన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీతేజ నడింపల్లి, సమర్పణ: చావలి రామాంజనేయులు. -
ఆండాళ్ గలాటా
‘‘ఇందులో నా పేరు ఆండాళ్. పేరుకు తగ్గట్టే సంప్రదాయబద్ధంగా, ఫన్నీగా ఉంటుంది నా పాత్ర. కథ, నా పాత్ర వినగానే... వెంటనే ‘ఓకే’ చెప్పేశాను. ఆద్యంతం సరదాగా సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది’’ అని హరిప్రియ చెప్పారు. శ్రీ, హరిప్రియ జంటగా రూపొందిన చిత్రం ‘గలాటా’. కృష్ణ దర్శకుడు. డి.రాజేంద్రప్రసాద్ వర్మ నిర్మాత. సునీల్ కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని ఎస్వీ కృష్ణారెడ్డి ఆవిష్కరించి, తొలి ప్రతిని సురేందర్‌రెడ్డికి అందించారు. వారితో పాటు కె.అచ్చిరెడ్డి, కేఎల్ దామోదరప్రసాద్ తదితరులు చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘‘తొలి సినిమాతోనే అలీ, సాయికుమార్ లాంటి సీనియర్ ఆర్టిస్టులను డెరైక్ట్ చేసే అవకాశం రావడం తన అదృష్టం’’ అని దర్శకుడు చెప్పారు. ఇందులో తనది రాజకీయ నాయకుని పాత్ర అని, మేరా భారత్ మహాన్ అంటూ తానేం చేశాననేది ఇందులో ఆసక్తికరమైన అంశమని సాయికుమార్ పేర్కొన్నారు. దర్శకుడు కృష్ణకు పేరు తెచ్చే సినిమా ఇదని చిత్ర సమర్పకుడు చావలి రామాంజనేయులు నమ్మకం వ్యక్తం చేశారు. శ్రీ మాట్లాడుతూ -‘‘నా కెరీర్లో భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఇది. చక్కని ప్లానింగ్‌తో దర్శక, నిర్మాతలు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని చెప్పారు. -
గలాట మూవీ ఆడియో లాంచ్
-
'గలాటా' సినిమా స్టిల్స్
-
వినోదాల గలాట
‘‘వినోదమే ప్రధానంగా రూపొందుతోన్న లవ్ ఎంటర్టైనర్ ఇది. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయి’’ అని దర్శకుడు కృష్ణ చెప్పారు. శ్రీ, హరిప్రియ జంటగా రాజేంద్రప్రసాద్‌వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేటి నుంచి వైజాగ్‌లో మూడో షెడ్యూలు జరగనుంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ షెడ్యూల్లో ఒక పాటను, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. దాంతో ఒక పాట మినహా షూటింగ్ పూర్తవుతుంది’’ అని తెలిపారు. నాగబాబు, సాయికుమార్, అలీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: ఫిరోజ్‌ఖాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీ తేజ నడింపల్లి. -
గలాట ఎందుకు?
‘‘పూర్తి స్థాయి వినోదాత్మక ప్రేమకథా చిత్రమిది. నాయికా నాయకుల పాత్ర చిత్రణ చాలా విభిన్నంగా ఉంటుంది’’ అని దర్శకుడు కృష్ణ చెప్పారు. శ్రీ, హరిప్రియ జంటగా క్రియేటివ్ పిక్సల్స్ ప్రొడక్షన్ పతాకంపై రాజేంద్రప్రసాద్ వర్మ నిర్మిస్తున్న చిత్రం ‘గలాట’. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో రెండో షెడ్యూలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘టైటిల్ తరహాలోనే సినిమా కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ గలాట ఎందుకనేది తెరపై చూస్తేనే ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం శ్రీ, హరిప్రియ, సాయికుమార్, నాగబాబు, రఘు కారుమంచి, వేణు తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. నవంబరులో మూడో షెడ్యూలు చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌కశ్యప్, కెమెరా: ఫిరోజ్‌ఖాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీతేజ నడింపల్లి. -
ప్రేమ గలాటా
‘ఈరోజుల్లో’ ఫేం శ్రీ, హరిప్రియ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘గలాటా’. కృష్ణ దర్శకుడు. రాజేంద్రప్రసాద్‌వర్మ నిర్మాత. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు చెబుతూ -‘‘వినోదాత్మకంగా సాగే ప్రేమకథ ఇది. ఇందులో శ్రీ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘తొలి షెడ్యూల్లో హీరోహీరోయిన్లతో పాటు అలీ, ఇతర పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. త్వరలోనే మలి షెడ్యూల్‌ని ప్రారంభిస్తాం’’ అని నిర్మాత తెలిపారు. సాయికుమార్, నాగబాబు, అలీ, అన్నపూర్ణమ్మ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: ఫిరోజ్ ఖాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీతేజ నడింపల్లి. -
గలాటా చేస్తారట
‘ఈ రోజుల్లో’ ఫేం శ్రీ, హరిప్రియ జంటగా కృష్ణ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్‌వర్మ నిర్మిస్తున్న చిత్రానికి ‘గలాటా’ అనే పేరును ఖరారు చేశారు. దర్శకుడు మాట్లాడుతూ-‘‘ఈ ప్రేమకథ ఆసక్తిగా ఉంటుంది. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది. అన్ని వర్గాలకూ ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు. తొలి షెడ్యూల్ హైదరాబాద్ పరిసరాల్లో పూర్తి చేశామని, పూర్తి కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతోన్న చిత్రమిదని నిర్మాత తెలిపారు. సాయికుమార్, నాగబాబు, అలీ, అన్నపూర్ణమ్మ, మేల్కొటే, కొండవలస, పృథ్వీ తదితరులు నటిస్త్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: ఫిరోజ్ ఖాన్, పాటలు: చైతన్య కృష్ణ, కూర్పు: నికోలస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీతేజ నడింపల్లి.