ఆండాళ్ గలాటా | sri-hari-priya-at-galata-telugu-movie-audio-launched | Sakshi
Sakshi News home page

ఆండాళ్ గలాటా

Published Tue, Mar 18 2014 12:24 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

ఆండాళ్ గలాటా - Sakshi

ఆండాళ్ గలాటా

‘‘ఇందులో నా పేరు ఆండాళ్. పేరుకు తగ్గట్టే సంప్రదాయబద్ధంగా, ఫన్నీగా ఉంటుంది నా పాత్ర. కథ, నా పాత్ర వినగానే... వెంటనే ‘ఓకే’ చెప్పేశాను. ఆద్యంతం సరదాగా సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది’’ అని హరిప్రియ చెప్పారు. శ్రీ, హరిప్రియ జంటగా రూపొందిన చిత్రం ‘గలాటా’. కృష్ణ దర్శకుడు. డి.రాజేంద్రప్రసాద్ వర్మ నిర్మాత. సునీల్ కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని ఎస్వీ కృష్ణారెడ్డి ఆవిష్కరించి, తొలి ప్రతిని సురేందర్‌రెడ్డికి అందించారు. వారితో పాటు కె.అచ్చిరెడ్డి, కేఎల్ దామోదరప్రసాద్ తదితరులు చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. 
 
 ‘‘తొలి సినిమాతోనే అలీ, సాయికుమార్ లాంటి సీనియర్ ఆర్టిస్టులను డెరైక్ట్ చేసే అవకాశం రావడం తన అదృష్టం’’ అని దర్శకుడు చెప్పారు. ఇందులో తనది రాజకీయ నాయకుని పాత్ర అని, మేరా భారత్ మహాన్ అంటూ తానేం చేశాననేది ఇందులో ఆసక్తికరమైన అంశమని సాయికుమార్ పేర్కొన్నారు. దర్శకుడు కృష్ణకు పేరు తెచ్చే సినిమా ఇదని చిత్ర సమర్పకుడు చావలి రామాంజనేయులు నమ్మకం వ్యక్తం చేశారు. శ్రీ మాట్లాడుతూ -‘‘నా కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఇది. చక్కని ప్లానింగ్‌తో దర్శక, నిర్మాతలు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement