చిట్టి ప్రేమకథ ఏంటి?
చిట్టి ప్రేమకథ ఏంటి?
Published Sun, Apr 6 2014 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 5:40 AM
బామ్మ పోరు పడలేక తనకు నచ్చిన తెలుగమ్మాయిని వెతుక్కుంటూ ముంబయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన చిట్టి అనే కుర్రాడికి ఆండాళ్ అనే అమ్మాయి తారపడుతుంది. తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘గలాటా’. శ్రీ, హరిప్రియ జంటగా నటించారు. కృష్ణ దర్శకుడు. డి.రాజేంద్రప్రసాద్‌వర్మ నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ప్రేమకథల్లో ఇదొక కొత్తకోణం. పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా ఇది. ఇటీవల విడుదలైన సునీల్ కశ్యప్ సంగీతానికి మంచి స్పందన వస్తోంది. యువతరం మెచ్చే కథాంశంతో జనరంజకంగా కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని తెలిపారు. సాయికుమార్, అలీ, నాగబాబు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ఫిరోజ్‌ఖాన్, పాటలు: కృష్ణచైతన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీతేజ నడింపల్లి, సమర్పణ: చావలి రామాంజనేయులు.
Advertisement
Advertisement