గలాటా చేస్తారట | 'Galata' is an upcoming telugu movie | Sakshi
Sakshi News home page

గలాటా చేస్తారట

Published Mon, Sep 30 2013 2:43 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

గలాటా చేస్తారట - Sakshi

గలాటా చేస్తారట

‘ఈ రోజుల్లో’ ఫేం శ్రీ, హరిప్రియ జంటగా కృష్ణ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్‌వర్మ నిర్మిస్తున్న చిత్రానికి ‘గలాటా’ అనే పేరును ఖరారు చేశారు. దర్శకుడు మాట్లాడుతూ-‘‘ఈ ప్రేమకథ ఆసక్తిగా ఉంటుంది. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది. 
 
 అన్ని వర్గాలకూ ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు. తొలి షెడ్యూల్ హైదరాబాద్ పరిసరాల్లో పూర్తి చేశామని, పూర్తి కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతోన్న చిత్రమిదని నిర్మాత తెలిపారు. 
 
 సాయికుమార్, నాగబాబు, అలీ, అన్నపూర్ణమ్మ, మేల్కొటే, కొండవలస, పృథ్వీ తదితరులు నటిస్త్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: ఫిరోజ్ ఖాన్, పాటలు: చైతన్య కృష్ణ, కూర్పు: నికోలస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీతేజ నడింపల్లి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement