వినోదాల గలాట
వినోదాల గలాట
Published Thu, Nov 14 2013 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM
‘‘వినోదమే ప్రధానంగా రూపొందుతోన్న లవ్ ఎంటర్‌టైనర్ ఇది. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయి’’ అని దర్శకుడు కృష్ణ చెప్పారు. శ్రీ, హరిప్రియ జంటగా రాజేంద్రప్రసాద్‌వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేటి నుంచి వైజాగ్‌లో మూడో షెడ్యూలు జరగనుంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ షెడ్యూల్‌లో ఒక పాటను, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. దాంతో ఒక పాట మినహా షూటింగ్ పూర్తవుతుంది’’ అని తెలిపారు. నాగబాబు, సాయికుమార్, అలీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: ఫిరోజ్‌ఖాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీ తేజ నడింపల్లి.
Advertisement
Advertisement