తియ్యని తలపుల ప్రణయం! | hari priya and sree starrer galata movie releasing on 25th | Sakshi
Sakshi News home page

తియ్యని తలపుల ప్రణయం!

Published Sun, Apr 20 2014 10:58 PM | Last Updated on Sat, Sep 2 2017 6:17 AM

తియ్యని తలపుల ప్రణయం!

తియ్యని తలపుల ప్రణయం!

ప్రేమలోకంలో విహరిస్తుంటుంది ఆ జంట. తియ్యని కబుర్లు చెప్పుకోవడంతో పాటు చిరుకోపాలు, అడపా దడపా అలకలతో వారి ప్రేమ ప్రయాణం హాయిగా సాగిపోతుంటుంది. అలాంటి వారి జీవితాలు ఎటువంటి మలుపు తీసుకున్నాయి? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘గలాటా’.ఈ  సినిమా ఆసాంతం వినోద ప్రధానంగా సాగుతుందని చిత్రదర్శకుడు కృష్ణ చెప్పారు. శ్రీ, హరిప్రియ జంటగా రాజేంద్రప్రసాద్ వర్మ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఓ అల్లరి జంట ప్రేమకథ ఇది. ప్రేమలోని కొత్త కోణాన్ని ఇందులో ఆవిష్కరించాం. సునీల్ కశ్యప్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రం ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీతేజ నడింపల్లి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement