
బిగ్‌బాస్ రియాలిటీ షో త్వరలో మొదలుకాబోతోంది. అవును, తమిళంలో బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్, హిందీలో 18వ సీజన్, కన్నడలో 11వ సీజన్ ప్రారంభానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల ఎంపిక ఓ కొలిక్కి రాగా సంబంధం లేని తారల పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వారిలో నటి హరిప్రియ ఒకరు.
బిగ్‌బాస్ ఎంట్రీపై క్లారిటీ
ఈమె కన్నడ బిగ్‌బాస్ 11వ సీజన్‌లో అడుగుపెడుతోందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. తాను ఏ రియాలిటీ షోలనూ పాల్గొనడం లేదంటూ పుకార్లకు చెక్ పెట్టింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. నేను నా ఇల్లు దాటి ఎక్కడికీ వెళ్లడం లేదు. నాకు నేనే బాస్ అని రాసుకొచ్చింది. ఇకపోతే కన్నడ బిగ్‌బాస్ 11వ సీజన్ రేపటి (సెప్టెంబర్ 29) నుంచే ప్రారంభం కానుంది.
సినిమా..
కన్నడలో అనేక సినిమాలు చేసిన హరిప్రియ తకిట తకిట, పిల్ల జమీందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, గలాట, జై సింహా, అలా ఇలా ఎలా వంటి పలు చిత్రాల్లో నటించింది.
Comments
Please login to add a commentAdd a comment