వర్షంలో ప్రణయం
వర్షంలో ప్రణయం
Published Thu, Jan 9 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
‘‘వానలో తడవనివారు... ప్రేమలో పడనివారు ఎవ్వరూ ఉండరు. వాన అంటే ఇష్టపడే ఓ అమ్మాయి, అబ్బాయి ఆ వర్షం సాక్షిగా తమలోని ప్రణయాన్ని ఆవిష్కరించుకుంటే ఎంత బావుంటుంది. ఈ సినిమాలో అలాంటి అనుభూతులు ఎన్నో ఉంటాయి’’ అని దర్శకుడు రమణ మొగిలి చెప్పారు. వరుణ్‌సందేశ్, హరిప్రియ జంటగా రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి. ఓబుల్ సుబ్బారెడ్డి, శ్రీనివాస్ చవ్వాకుల నిర్మించిన చిత్రం ‘ఈ వర్షం సాక్షిగా’. ఈ నెలలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అనిల్ గోపిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎమ్.కిషోర్‌కుమార్, సమర్పణ: మాస్టర్ ప్రీతమ్ రెడ్డి.
Advertisement
Advertisement