Ee Varsham Sakshiga
-
డబ్బుల వర్షం కురవాలి
వరుణ్‌సందేశ్, హరిప్రియ జంటగా రూపొందిన చిత్రం ‘ఈ వర్షం సాక్షిగా’. రమణ మొగిలి దర్శకుడు. బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మాత. అనిల్ గోపిరెడ్డి స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక... తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు విద్యాసాగర్‌రావు, దర్శకుడు శ్రీవాస్ చేతుల మీదుగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. సినిమా కూడా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. ‘ఈ వర్షం సాక్షిగా’ నిర్మాతకు డబ్బుల వర్షం కురిపించాలని వరుణ్‌సందేశ్ ఆకాంక్షించారు. వరుణ్, హరిప్రియ జంట యువతరాన్ని ఆకట్టుకుంటుందని దర్శకుడు చెప్పారు. ఈ 13న సినిమా విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. -
ఈ వర్షం సాక్షిగా... ఆడియో ఫంక్షన్ Part - 2
-
ఈ వర్షం సాక్షిగా... ఆడియో ఫంక్షన్ Part - 1
-
ఈ వర్షం సాక్షిగా మూవీ స్టిల్స్
-
వర్షంలో ప్రణయం
‘‘వానలో తడవనివారు... ప్రేమలో పడనివారు ఎవ్వరూ ఉండరు. వాన అంటే ఇష్టపడే ఓ అమ్మాయి, అబ్బాయి ఆ వర్షం సాక్షిగా తమలోని ప్రణయాన్ని ఆవిష్కరించుకుంటే ఎంత బావుంటుంది. ఈ సినిమాలో అలాంటి అనుభూతులు ఎన్నో ఉంటాయి’’ అని దర్శకుడు రమణ మొగిలి చెప్పారు. వరుణ్‌సందేశ్, హరిప్రియ జంటగా రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి. ఓబుల్ సుబ్బారెడ్డి, శ్రీనివాస్ చవ్వాకుల నిర్మించిన చిత్రం ‘ఈ వర్షం సాక్షిగా’. ఈ నెలలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అనిల్ గోపిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎమ్.కిషోర్‌కుమార్, సమర్పణ: మాస్టర్ ప్రీతమ్ రెడ్డి. -
‘ఈ వర్షం సాక్షిగా’
‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’ తర్వాత వరుణ్ సందేశ్, హరిప్రియ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘ఈ వర్షం సాక్షిగా’. రమణ మొగిలి దర్శకత్వంలో రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి.ఓబుల్ సుబ్బారెడ్డి, శ్రీనివాస్ చవాకుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘నీ నవ్వు తారల్లే... మెరుస్తుందలా’ అనే పాటను ప్రస్తుతం హీరో హీరోయిన్లపై చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘కుటుంబ భావోద్వేగాలు మేళవించిన ప్రేమకథ ఇది. పూర్తి వినోదాత్మకంగా ఉండే ఈ చిత్రంలో అన్ని వర్గాలవారినీ మెప్పించే అంశాలున్నాయి. ఈ నెల 20 వరకూ జరిపే ఆఖరి షెడ్యూలుతో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అనిల్ గోపిరెడ్డి, మాటలు: రామస్వామి, కెమెరా: మోహన్‌చంద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.కిషోర్‌కుమార్, సమర్పణ: మాస్టర్ ప్రీతమ్‌రెడ్డి.