Kannada actors Vasishta Simha-Haripriya tie the knot in Mysuru - Sakshi
Sakshi News home page

Vasishta Simha -Haripriya : కేజీఎఫ్‌ నటుడితో కలిసి పెళ్లిపీటలెక్కిన హీరోయిన్‌.. ఫోటోలు వైరల్‌

Published Fri, Jan 27 2023 10:57 AM | Last Updated on Fri, Jan 27 2023 11:14 AM

Kannada Actors Vasishta Simha And Haripriya Tie The Knot In Mysuru - Sakshi

'పిల్ల జమీందార్‌' హీరోయిన్‌ హరిప్రియ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. కేజీఎఫ్‌ సినిమాలో విలన్‌గా నటించిన వశిష్ట సింహాతో కలిసి ఆమె ఏడుడుగులు వేసింది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట మైసూరులోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది.

శివరాజ్‌కుమార్‌, డాలీ ధనంజయ్, అమృత అయ్యంగార్ తదితర సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు.దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కన్నడ బ్యూటీ హరిప్రియకు తెలుగు పరిశ్రమతోనూ మంచి అనుబంధం ఉంది.

తకిట తకిట సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు నాని సరసన పిల్ల జమిందార్ సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలయ్యతో జై సింహ, వరుణ్ సందేశ్‌తో ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’ వంటి నటించింది.మరోవైపు వశిష్ట సింహా ఆర్య లవ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. రాజా హులి, రుద్ర తాండవలో ప్రధాన ప్రతినాయకుడిగా మెప్పించారు. కేజీఎఫ్‌లో విలన్ పాత్ర పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement