శ్రీమఠంలో సినీ నటి హరిప్రియ
శ్రీమఠంలో సినీ నటి హరిప్రియ
Published Thu, Aug 25 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం సినీ నటి హరిప్రియ బుధవారం రాత్రి మంత్రాలయం వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసిరాగా అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి మఠం మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా ఆమె గ్రామ దేవత మంచాలమ్మ ఆలయంలో అర్చనలు చేసుకున్నారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూలబందావనం దర్శించుకుని పూజలు, హారతులు పట్టారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు.. శేషవస్త్రాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, ఫల,పూల మంత్రాక్షింతలతో ఆశీర్వదించారు. ఆమె మాట్లాడుతూ తెలుగులో పిల్ల జమిందార్, తకిట తకిట, ఈ వర్షం సాక్షిగా, గలాట చిత్రాలు, కన్నడలో 16, తమిళంలో ఓ చిత్రంలో నటించినట్లు వివరించారు. పిల్ల జమిందార్ చిత్రం తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిందన్నారు.
Advertisement
Advertisement