శ్రీ మఠంలో సినీ సంగీత దర్శకుడు
మంత్రాలయం రూరల్: శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనార్థం సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుటుంబసభ్యులతో సోమవారం మంత్రాలయం వచ్చారు. ఆయన ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూలబృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి శ్రీ మఠం పీఠాధిపతి సుభుధేంద్రతీర్థులు శేషవస్త్రం, స్వామివారి మెమొంటో, ఫలమంత్రాక్షితలిచ్చి ఆశీర్వాదించారు.