శ్రీమఠం అభివృద్ధికి కృషి
శ్రీమఠం అభివృద్ధికి కృషి
Published Thu, Feb 16 2017 12:09 AM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM
- పీఠాధిపతి సుబధేంద్ర తీర్థులు
– అన్నపూర్ణ భోజనశాలతో ఏసీ వెయిటింగ్ హాల్‌కు భూమి పూజ
– బృందావన గార్డెన్‌తో 66 నూతన గదుల నిర్మాణానికి శ్రీకారం
– దాతల సహకారంతో శ్రీమఠానికి ప్రగతి కళ
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నట్లు పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు తెలిపారు. బుధవారం అన్నపూర్ణ భోజన శాలతో తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఏసీ వెయిటింగ్ హాల్, బృందావన గార్డెన్‌తో 66 గదులు, డార్మిటరీ సముదాయం నిర్మాణానికి పీఠాధిపతి భూమిపూజ చేశారు. కర్ణాటక ఎమ్మెల్సీ నారాయణస్వామి సౌజన్యం రూ.80 లక్షలతో ఏసీ వెయిటింగ్ హాల్, ఆపైన రెండు ఏసీ వీవీఐపీ సూట్స్ నిర్మిస్తారు. కర్ణాటక శ్రీరాఘవేంద్ర కో–ఆపరేటివ్ సొసైటీ నేతృత్వంలో డార్మిటరీ, 66 గదులు నిర్మాణం చేపడతారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య పీఠాధిపతి నారీకేళ సమర్పణ, భూమిపూజ గావించారు. పీఠాధిపతి మాట్లాడుతూ.. దాతలు, భక్తుల సహకారంతో శ్రీమఠం గర్భాలయ శిలామండపం, స్వర్ణగోపురాలు, సుయతీంద్రతీర్థుల 200 గదులు సముదాయం, సుశీలేంద్ర 100 గదుల భవన నిర్మాణాలు చేపట్టామన్నారు. ప్రస్తుతం వికలాంగుల విశ్రాంత నిలయం, శ్రీమఠం క్వార్టర్స్‌తో విశ్రాంత పార్కు పనులు సాగుతున్నాయన్నారు. రాఘవేంద్రస్వామి కృపతో మఠం రోజురోజుకు అభివృద్ధి చెందుతోందన్నారు. దాతలు మాట్లాడుతూ ఆగస్టులో జరిగే రాయరు సప్తరాత్రోత్సవాలకు.. నిర్మాణాలు పూర్తిచేస్తామన్నారు. కార్యక్రమంలో ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ఈఈ సురేష్ కోనాపూర్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు.
Advertisement