Kannada Actress Haripriya Revealed Her Love Story With Vashishta Simham, Deets Inside - Sakshi
Sakshi News home page

Actress Haripriya Love Story: అతనితో ప్రేమలో పడడానికి కారణం కుక్క పిల్లనే: లవ్‌స్టోరీ రివీల్‌ చేసిన హీరోయిన్‌

Published Wed, Dec 7 2022 1:57 PM | Last Updated on Wed, Dec 7 2022 3:29 PM

Kannada Actress Haripriya Revealed Her Love Story - Sakshi

‘తకిట తకిట’ చిత్రంతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచమైంది కన్నడ బ్యూటీ హరిప్రియ.  ఆ తర్వాత నానితో  పిల్ల జమీందార్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో హరిప్రియకు వరుస అవకాశాలు వచ్చాయి.  అబ్బాయి క్లాస్‌ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా చిత్రాల తర్వాత ఏకంగా నటసింహం బాలకృష్ణతో నటించే అవకాశం కొట్టేసింది. ‘ జై సింహా’లో బాలయ్య  సరసన నటించి,మెప్పించింది. ఆ సినిమా తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు కానీ.. కన్నడలో మాత్రం వరుస సినిమాలతో దూసుకెళ్లింది. 

షబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, శ్రీమురళి వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఈ క్రమంలో తన సహచర నటుడు వశిష్ట సింహతో ప్రేమలో పడింది. ఇటీవల కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. తాజాగా తన లవ్‌స్టోరీని రివీల్‌ చేసింది ఈ కన్నడ బ్యూటీ. ఓ కుక్కపిల్ల కారణంగా తాను వశిష్టతో ప్రేమలో పడిపోయానని చెప్పుకొచ్చింది.

 ‘నా దగ్గర  లక్కీ, హ్యాపీ అనే రెండు కుక్క పిల్లలు ఉండేవి. వాటిలో లక్కీ అనే కుక్క చనిపోయింది. దీంతో హ్యాపీ ఒంటరైపోయింది. అలాంటి సమయంలో వశిష్ట సింహం నాకు ఓ కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చాడు. దాని పేరు క్రిస్టల్‌. కొత్తగా వచ్చిన క్రిస్టల్‌తో హ్యాపీ కలిసిపోయింది. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అయితే క్రిస్టల్‌ని బహుమతిగా ఇచ్చినప్పుడు.. వశిష్ట ఓ సందేశాన్ని కూడా పంపించాడు. క్రిస్టల్ పొట్టపై గుండె ఆకారంలో ఓ మచ్చ ఉంది. క్రిస్టల్‌తో పాటు ఆ మచ్చ కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో పాటు మా మధ్య ప్రేమ కూడా పెరిగింది. అలా మా ప్రేమకు క్రిస్టల్‌ కారణమైంది’ అని హరిప్రియ తన ప్రేమ కహానిని చెప్పుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement