
లవ్‌లో పడ్డ హరిప్రియ
టీనగర్: మురన్, వల్లకోట్టై, వారాయో వెన్నిలావే... వంటి చిత్రాల్లో నటించారు హరిప్రియ. ప్రస్తుతం కన్నడంలో సుధీప్, రక్షిత్ షెట్టి జంటగా రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల సుధీప్‌తో నటించిన రన్నా చిత్రం ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. హరిప్రియ ఇతర చిత్ర యూనిట్‌తో సుధీప్ పాల్గొననున్నట్లు ప్రకటించారు. అయితే సుధీప్‌తో పాటు చిత్రంలో నటించిన ర క్షితా రాం మాత్రమే పాల్గొన్నారు. హరిప్రియ పాల్గొనలేదు. దీనిగురించి విచారించగా ఆమె రక్షిత్‌తో జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్లినట్లు సమాచారం. ఇటీవల కాలంగా హరిప్రియకు అనేక సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని అంగీకరించేందుకు నిరాకరిస్తున్నారు. రక్షిత్‌తో హరిప్రియ పేమల్లో పడినట్లు, వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. దీన్ని దృష్టిలో ఉంచుకునే హరిప్రియ చిత్రాలను నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది.