నిత్యలో మార్పునకు అదే కారణమా? | Nitya Menon Love Affair with Sudeep | Sakshi

నిత్యలో మార్పునకు అదే కారణమా?

Apr 9 2016 1:53 AM | Updated on Sep 3 2017 9:29 PM

నిత్యలో మార్పునకు అదే కారణమా?

నిత్యలో మార్పునకు అదే కారణమా?

మనిషిలో మార్పు అనేది సహజం. అయితే ఒక్కసారిగా ప్రవర్తనలో మార్పు కనిపిస్తే అందుకు బలమైన కారణం

మనిషిలో మార్పు అనేది సహజం. అయితే ఒక్కసారిగా ప్రవర్తనలో మార్పు కనిపిస్తే అందుకు బలమైన కారణం ఏదో ఉండే ఉంటుందని భావించాల్సి వస్తుంది. ప్రస్తుతం నటి నిత్యామీనన్‌లో అలాంటి మార్పే స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు చిత్ర వర్గాలు. ఎప్పుడూ కథలు వినడం, షూటింగ్‌లకు వెల్లడం అంటూ ఒక ప్రణాళికాబద్ధంగా నడుచుకునే నిత్య ప్రవర్తనలో ఇప్పుడు చాలా మార్పు కనిపిస్తోందంటున్నారు.
 
  ఇంతకు ముందు పొగరుబోతుగా పట్టం కట్టించుకున్న నిత్యామీనన్‌లో ఇప్పుడు పూజలు, పునస్కారాలు అంటూ భక్తి భావం పెరిగిపోయిందట. తన స్నేహితురాళ్లతో కూడా వేదాంత ధోరణితో మాట్లాడుతోందట. ఇంకా చెప్పాలంటే ఇటీవల నిత్యామీనన్ దోషనివారణ పూజలు చేయించారట. ఆ పూజలో ఆమె బంధువర్గాలు కూడా పాల్గొన్నారని తెలిసింది. ఇంతలో ఆమెలో అంత మార్పునకు కారణం ఏమైఉంటుందన్నదే అందరిలో కుతూహలాన్ని పెంచుతున్న అంశం.
 
 నిత్యామీనన్ తాజాగా అప్పావిన్ ఆశై, 24,ముడింజా ఇవనై పిడి తదితర తమిళ చిత్రాలతో పాటు కన్నడం, తెలుగు భాషా చిత్రాల్లో నటిస్తున్నారు. ముడింజా ఇవనై పిడి చిత్రంలో సుధీప్‌కు జంటగా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే వీరి మధ్య పరిచయం ప్రేమగా మారిందని, అది త్వరలో పెళ్లికి దారి తీయనుందనే ప్రచారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇలాంటి ప్రచారానికి, నిత్యామీనన్ దోషనివారణ పూజలకు ఎమైనా సంబంధం ఉండి ఉంటుందా?అ న్న కూపీ లాగే పనిలో పడ్డారు ఒక వర్గం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement