నయీం క్యారెక్టర్ కోసం నక్సలైట్స్ గురించి ఆరా తీశా: వశిష్ట సింహా | Vasishta Simha Comments On Nayeem Diaries Movie | Sakshi
Sakshi News home page

Nayeem Diaries: నయీం కథ వింటే ముందు కోపం, తర్వాత జాలి కలుగుతుంది

Dec 7 2021 4:48 PM | Updated on Dec 7 2021 4:48 PM

Vasishta Simha Comments On Nayeem Diaries Movie - Sakshi

‘నాకు సహజంగానే నెగిటివ్ రోల్స్ అంటే ఇష్టం. థియేటర్ నాటికల్లోనూ నెగిటివ్ పాత్రలు చేశాను. నెగిటివ్ రోల్స్ లో నటించేందుకు చాలా స్వేచ్ఛ ఉంటుంది . హీరోకు ఉండే పరిమితులు ప్రతినాయకుడికి ఉండవు. అందుకే నాకు విలన్‌ పాత్రలు అంటే ఇష్టం’అన్నారు హీరో వశిష్ట సింహా. కేజీఎఫ్, నారప్ప సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ యంగ్‌ హీరో.. తాజాగా ‘నయీం డైరీస్‌’లో ప్రధాన పాత్రలో నటించారు. . వరదరాజు నిర్మించిన ఈ చిత్రానికి దాము బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ నెల 10న నయీం డైరీస్ సినిమా విడుదలవుతున్న సందర్భంగా వశిష్ట సింహా మీడియాతో ముచ్చటించారు. ఈ విశేషాలు..

సంగీత దర్శకుడు హంసలేఖ నా అభిమాన సంగీత దర్శకుడు. ఆయన కన్సర్ట్ జరుగుతుంటే వెళ్లి కలవాలని ప్రయత్నించాను. ఆ తర్వాత హంసలేఖ నోటీస్ కు వెళ్లాను. ఒక రోజు ఆయన పిలిచి పాడమని అడిగారు. అలా సింగర్ గా నా జర్నీ మొదలైంది. పెద్ద ప్రొపెషనల్ సింగర్ ను కాదు కానీ...సినిమా మీద ఆసక్తి పెరిగింది. అలా ఇండస్ట్రీకి రాగలిగాను. 

కాలేజ్ లో ఉన్నప్పుడు రౌడీ గ్యాంగ్ మాది. కాలేజ్ లో ఉన్నప్పుడే కల్చరల్ యాక్టివిటీస్ చేసేవాళ్లం. నాటికను డైరెక్ట్ చేశాను. ఆ నాటికకు అవార్డ్ వచ్చింది. ఇదంతా నాకు ఎంకరేజింగ్ గా ఉండేది. బెంగళూరు థియేటర్ నాటికలకు తరుచూ వెళ్లేవాడిని. అలా సినిమా వైపు మరింత ఆకర్షితం అయ్యాను. థియేటర్ నాటికల్లో నటించడం మొదలుపెట్టాను. అరడజను నాటికల్లో నటించాను. జాబ్ చేస్తూనే ఇటు నాటికల్లో నటించేవాడిని. పనిచేసే కంపెనీ నుంచి బయటకొచ్చి నాటికల్లో పూర్తిగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. అక్కడి నుంచి నా సినిమా ప్రయాణం మొదలైంది.

సినిమాల్లో డీవోపీ, ఎడిటింగ్ ఇలా. చాలా డిపార్ట్ మెంట్ ల్లో పనిచేశాను. యష్ సినిమాలో ఒక నెగిటివ్ రోల్ లో నటించాను. ఆ పాత్రకు బాగా పేరొచ్చింది. అలా విలన్ గా నా కెరీర్ మొదలైంది. ఆ తర్వాత మంచి మంచి క్యారెక్టర్స్ దొరికాయి. ఇక్కడ కిరాక్ పార్టీలో ఒక క్యారెక్టర్ లో నటించాను. అలా నేను బిజీగా మారిన టైమ్ లో నిర్మాత వరదరాజు గారు బెంగళూరు వచ్చారు. దర్శకుడు దాము బాలాజీ గారికి నయీం డైరీస్ కోసం పరిచయం చేశారు. ఈ కథ నాకు బాగా నచ్చింది. అలా నయీం డైరీస్ మూవీ లో జాయిన్ అయ్యాను.

నయీం కథ విన్నప్పుడు మనిషి ఇంత క్రూరంగా ఉంటాడా అనిపించింది. జీవితంలో ఎన్నో సాధిస్తాం. ఎంతో సంపాదిస్తాం. కానీ ఒక ఘటన ఎదురైనప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది తర్వాత భవిష్యత్ ను నిర్ణయిస్తుంది. నయీం అనే మనిషి త్వరగా, గట్టిగా రియాక్ట్ అవుతాడు. తర్వాత ఏంటనేది ఆలోచించడు. ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు ఒక గ్యాంగ్ స్టర్ గా ఎదగడం సర్ ప్రైజింగ్ గా అనిపిస్తుంది. నారప్ప, కేజీఎఫ్ తర్వాత నయీం డైరీస్ సినిమా చేయడం నాకు ఛాలెంజింగ్ గా అనిపించింది. నయీం క్యారెక్టర్ లో ఉన్న డెప్త్, ఇంటర్నల్ ఎమోషన్ నాకు బాగా నచ్చింది. ఇలాంటి పాత్రలు తరుచూ దొరకవు. ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంటుంది. 

నయీం కథ ఎవరైనా ముందు వింటే కోపం వస్తుంది, ఆ తర్వాత జాలి కలుగుతుంది. నేను కూడా నయీం గురించి యూట్యూబ్ ద్వారా నెట్ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. మీడియా ఇంటర్వ్వూస్ చూశాను, ఆర్టికల్స్ చదివాను. నక్సలైట్స్ గురించి తెలుసుకున్నాను. ఇలా నయీం క్యారెక్టర్ కోసం కంప్లీట్ గా ప్రిపేర్ అయ్యాను. స్క్రిప్ట్ కూడా చాలా బాగుంటుంది. క్రైమ్ ను, ఎమోషన్ ను దర్శకుడు కొత్తగా చూపించారు. డైలాగ్స్ బాగుంటాయి.

నయీం ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అని అన్నప్పుడు కాంట్రవర్సీ వస్తుంది. ఇలాంటి సినిమాలో ఎందుకు నటించావు అనే ప్రశ్నలూ వస్తాయి. కానీ నేనొక నటుడిని. నయీంకు సంబంధించిన ఏ విషయాలతో నాకు సంబంధం లేదు. నయీంను ఈ సినిమాలో మంచిగా చూపించే ప్రయత్నం చేయలేదు. అతని జీవితం ఎలా సాగిందో, అలాగే ఒక అద్దంలా తెరకెక్కించాం. నాణేనికి రెండో వైపు ఉన్నట్లు ...నయీం  కొందరికి హీరో అంటే ఆశ్చర్యం కలుగుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement