ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హైవోల్టేజ్ యాక్షన్ మూవీ 'సలార్' రిలీజ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్ 22 సలార్ వార్ డిసైడ్ చేయనున్నాడు. ఇక 'సలార్'కు పోటీగా షారుక్ ఖాన్ నటించిన 'డంకి' సినిమా బరిలోకి దిగనుంది. అలా క్రిస్టమస్ సంబరాల్లో 2 సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ జరగనుంది. ఈ రెండు సినిమాలతో పాటు హాలీవుడ్ 'అక్వామన్' సినిమా కూడా తెరపైకి వస్తోంది.ప్రస్తుతం చికిత్స కోసం ప్రభాస్ విదేశాల్లో ఉంటున్నాడు. త్వరలో ఆయన భారత్‌లో ల్యాండ్ కానున్నాడు. ఆయన ఎంట్రీ ఇచ్చాక 'సలార్' సినిమా ప్రచారం ప్రారంభం కానుంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బిజీగా సాగుతోంది. గ్రాఫిక్స్ వర్క్ మరింత బెటర్ ఉండాలని భావించిన ప్రశాంత్ నీల్ సినిమా విడుదల తేదీని వాయిదా వేసి మరీ సలార్ పనులు చూస్తున్నాడు. ఇక 'కేజీఎఫ్' చిత్రానికి పనిచేసిన స్టార్‌లు 'సలార్' కోసం పనిచేస్తున్నారు. శ్రుతి హాసన్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు, దేవరాజ్ సహా పెద్ద తారగణమే ఈ సినిమాలో ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానున్న సలార్.. కన్నడలో ప్రభాస్ పాత్రకు నటుడు వశిష్ఠ సింహ వాయిస్ ఇస్తున్నాడు.
కన్నడ నటుడు వశిష్ఠ సింహ 'సలార్' టీమ్‌తో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రకు గట్టిగా ధ్వనించే కంఠంతో వాయిస్ అందిస్తున్నాడు. ఈ వార్త విని అభిమానులు ఎంతగానో ఆనందిస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్‌కు ఆయన వాయిస్ బేస్ కరెక్ట్‌గా సెట్ అవుతుందని వారు అంటున్నారు. ఈ విషయంలో ప్రశాంత్ నీల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేజీఎఫ్‌లో హీరో యష్‌కి తెలుగులో వాయిస్ ఇచ్చింది డబ్బింగ్ ఆర్టిస్ట్ గౌతమ్... మొదట ఆయన వాయిస్ సెట్ కాదని అందరూ చెప్పినా ప్రశాంత్ నీల్ ఓకే చేశాడట. ఫైనల్‌గా రిజల్ట్ తెలిసిందే.
(ఇదీ చదవండి: లియో కొత్తగా మళ్లీ వస్తున్నాడు.. వారికి మాత్రమే ఎంట్రీ.. ఎందుకంటే?)
అదే రీతిలో వశిష్ఠ కన్నడ వాయిస్ కూడా ప్రభాస్‌కు బాగా సెట్ అవుతుందని మేకర్స్ ప్లాన్ చేశారట. తెలుగులో ఎంతటి మాస్ డైలాగ్ అయినా సరే ప్రభాస్ చెబితే విజిల్స్ పడాల్సిందే.. కానీ కన్నడలో యంగ్ రెబల్ స్టార్ డబ్ చేసే సాహసం చేయడం లేదు. అందుకు తను పర్‌ఫెక్ట్ కాదని వశిష్ఠ వాయిస్‌ను సూచించారట. ఇప్పటికే ప్రభాస్ డైలాగ్స్ అన్నీ వశిష్ఠ పూర్తి చేశాడని తెలుస్తోంది. అతని వాయిస్ మన డైనోసార్ కటౌట్‌కు పక్కాగా సెట్ అయిందట. ఇదే విషయాన్ని ప్రభాస్ కూడా మేకర్స్‌కు తెలిపాడట.
ఇదిలా ఉంటే శ్రుతి హాసన్ 5 భాషల్లోనూ తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. 1000 కోట్ల రూ. కలెక్షన్స్ టార్గెట్ చేసి సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక 'సలార్' ట్రైలర్ కోసం డార్లింగ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీపావళి సందర్భంగా సలార్ ట్రైలర్ విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది.
వశిష్ట ఎవరంటే..
వశిష్ట సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడిగా ప్రవేశించాడు. అతను మొదట ఆర్యస్ లవ్ చిత్రం ద్వారా 2013లో వెండితెరపై మెరిశాడు. ఆ తర్వాత తమిళ్, తెలుగు చిత్రాలతో మెప్పించాడు. వెంకటేష్ నటించిన నారప్ప సినిమాలో సీనప్ప పాత్రలో మెప్పించిన వశిష్ట.. ఒదెలా రైల్వే స్టేషన్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు. KGF లో , బెంగుళూరుకు చెందిన గ్యాంగ్‌స్టర్ కమల్ పాత్రను వశిష్ట పోషించాడు , ఈ చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా ఆయన సూపర్ అనిపించాడు. సింగర్‌గా కూడా కన్నడలో పలు పాటలు పాడాడు.
Comments
Please login to add a commentAdd a comment