
ప్రతీకాత్మక చిత్రం
మీడియా కంట పడకుండా రహస్యంగా కోర్టులో హాజరుపరిచి..
కరీంనగర్: పలు మోసాలకు పాల్పడిన ఓ మాయ లేడీని కరీంనగర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. భక్తి భావం ముసుగులో మాతగా హరిప్రియ మోసాలు చేసినట్లు వెల్లడైంది. హరిప్రియతో పాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా కంట పడకుండా రహస్యంగా కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. వారి నుంచి నకిలీ దేవతా విగ్రహాలు స్వాధీనం చేసుకున్నారు. వందల మంది వద్ద నుంచి సుమారు రూ.11 కోట్లు వసూలు చేసి మోసం చేసినట్లు సమాచారం. ఒక్కొక్కరుగా బాధితులు రహస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.