
వైఎస్ లాంటి నేతలు కావాలి: హరిప్రియ
నాకు రాజకీయాల గురించి పెద్దగా తెలియని రోజులవి. కర్నాటకలో నేను డిగ్రీ చదవుకుంటున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గారి గురించి చాలా గొప్పగా చెప్పుకునేవారు. చాలా పవర్‌పుల్ లీడర్ అని అందరూ అనుకుంటుంటే వినేదాన్ని. ఆ తర్వాత నేను హీరోయిన్‌గా టాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషలన్నింటిలో సినిమాలు చేశాను. ఆ సమయంలో కూడా అన్ని రాష్ట్రాల్లోనూ ఆయన పేరు మార్మోగేది. నిజంగా అలాంటి నేతలు పాలకులుగా రావాలి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మన భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉంది. ఇప్పుడైనా అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉండాలంటే సమర్థులైన నేతలకే ఓటెయ్యాలి.
- హరిప్రియ, ‘ఈ వర్షం సాక్షిగా’ ఫేం